Heart Attack: గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? నిపుణులు ఏమంటున్నారు..?

Heart Attack: ఏ జీవి శరీరంలో అయినా అతి ప్రధానమైనది గుండె. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సి..

Heart Attack: గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? నిపుణులు ఏమంటున్నారు..?
Follow us
Subhash Goud

|

Updated on: Oct 29, 2021 | 6:13 PM

Heart Attack: ఏ జీవి శరీరంలో అయినా అతి ప్రధానమైనది గుండె. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గుండెకు రక్తం సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గుండె నొప్పి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం కారణంగానే జరుగుతున్నాయని పరిశోధనలలో తేలింది. గుండెపోటు వచ్చిన వెంటనే గంటలోనే రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లగలిగితే ప్రయోజనం ఉంటుందని, చాలా కేసులలో బాధితులకు ఛాతినొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రికి చేరుకోగల్గుతున్నారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని పేర్కొంటున్నారు.

సాధారణంగా ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంట సేపటి వరకు కూడా శరీరంలో రక్తం సరఫరా జరుగుతుందని, మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన వెంటనే ఆస్పత్రికి చేరుకోవడం మేలని అంటున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డన్‌ అవర్‌ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు రాకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ప్రతి రోజు వ్యాయామం, మద్యపానానికి దూరంగా ఉండటం, పొగాకు దూరంగా ఉండటం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో గుండె నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య చాలా పెరిగిపోతోంది. గుండెపోటు వచ్చిన వారు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడే వారు వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందుడం మేలంటున్నారు. గుండెనొప్పి రావడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు వైద్యులు. ముఖ్యంగా టెన్షన్‌కు గురి కావడం, ఒత్తిడి, అధిక ఆలోచన ఇలా రకరకాల ఒత్తిళ్లకు గురయ్యే వారిలో గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుండె నిపుణులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

గుండె పోటుకు ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి:

► గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి.

► రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటే వైద్యుడిని సంప్రదించాలి.

► తరచుగా జలుపు, జ్వరం, దగ్గు వస్తున్నా.. అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే.

► శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండె నొప్పి రాబోతుందని గుర్తించాలి.

► గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

► మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి.

► తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు.

► మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురికావడం, చెప్పాలనుకొనే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండెపోటుకు సంకేతాలుగా భావించాలి.

► కొందరికి దవడలు, గొంతు నొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు.

► వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండెనొప్పికి దారితీస్తాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.

► కంటి చివరిలో కురుపులు ఏర్పడినా నిర్లక్ష్యం వద్దు. అవి గుండె పోటుకు దారితీయొచ్చు.

► కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బుతున్నట్లయితే గుండె పోటుగా అనుమానించాలి.

► గుండె సమస్యలుంటే.. తప్పకుండా హార్ట్ బీట్‌ను చెక్ చేసుకోవాలి. అసాధారణంగా గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి తింటే మీ గుండె పదిలం:

దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, తగినంత వ్యాయమం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి. రక్తనాళాల్లో కోలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆకు కూరలు: ఆకు కూరలు గుండెకు ఎంతో మంచిది. క్యాన్సర్‌ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తమీద, ర్యాడిష్‌ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఎంతో సహాయపడతాయి. రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.

ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్టులో ఓట్స్‌ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే బీటా గ్లూకాన్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్‌ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్‌, ఐరన్‌, ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

చేపలు తింటే ఉపయోగాలెన్నో.. సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగు పరుస్తాయి.

ఒత్తిడిని తగ్గించుకోండి.. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. మన దానిని జయించినట్లయితే చాలా వరకు హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో చిట్కా పాటిస్తుంటారు. కొందరు అంకెలను లెక్క పెట్టుకుంటే.. మరి కొందరు తమకు ఇష్టమైన పాటలు వినడమో.. లేక పుస్తకాలు చదవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి దూరం అవుతుంది. ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది.

ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...