AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart attack: గుండెపోటు వచ్చిన ఆ గంట చాలా కీలకం.. ఏం చేయాలో తెలుసుకోండి..

భారతదేశంలో హృద్రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆహారం, జీవనశైలిలో ఆటంకాల కారణంగా గుండె సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయి. వైద్య నిపుణులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం..

Heart attack: గుండెపోటు వచ్చిన ఆ గంట చాలా కీలకం.. ఏం చేయాలో తెలుసుకోండి..
Golden Hour Heart Attack
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2021 | 4:19 PM

Share

Golden Hour Heart Attack: భారతదేశంలో హృద్రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆహారం, జీవనశైలిలో ఆటంకాల కారణంగా గుండె సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయి. వైద్య నిపుణులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం చికిత్సతోపాటు జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమను పెంచుకోవడం ఇక్కడ చాలా అవసరం ఉంది. అయితే మెజారిటీ గుండెపోటు మ‌ర‌ణాలు స‌మ‌యానికి ఆస్ప‌త్రికి చేరుకోకపోవ‌డం వ‌ల్ల‌నే జ‌రుగుతున్నాయ‌ని కార్డియక్ ఎక్స్‌ప‌ర్ట్స్ అంటున్నారు. గుండెపోటు వ‌చ్చిన మొద‌టి గంట‌లోనే పేషెంట్‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసుల‌లో బాధితుల‌కు ఛాతిలో నొప్పి వ‌చ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్ప‌త్రిలో చేరుతున్నారని.. అయితే అప్ప‌టికే జ‌రుగాల్సిన న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

ఎవ‌రికైనా గుండెపోటు వ‌చ్చిన గంట‌సేప‌టి వ‌ర‌కు కూడా శ‌రీరానికి ర‌క్త‌స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌ లేదా గోల్డెన్ టైమ్ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు.

గోల్డెన్ అవర్ అంటే ఏమిటి..? కార్డియాలజిస్టులకు ఇది ఎందుకు అంత ముఖ్యమైనది?

గుండెపోటు వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభించాలని డాక్టర్లు వెల్లడించారు. బాధితుడిని వెంటనే చికిత్స అందించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చంటున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ త్యాగి గుండెపోటు తర్వాత ఏం జరుగుతోందో వివరించారు. ఆ తొలిసారి వచ్చిన స్టోక్ ఆ వెంటనే గుండె మొత్తానికి వ్యాపించే ప్రమాదం ఉందని అన్నారు.

హృదయ స్పందనలో ఏమి జరుగుతుంది?

డాక్టర్ సంజయ్ త్యాగి చెప్పినదాని ప్రకారం.. గుండె కొట్టుకోవడంలో కొంత సమస్య మొదలవుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే చికిత్స చేస్తే పల్స్ తిరిగి మొదలవుతుంది. ఇలా వెంటనే చికిత్స అందించడం వల్ల రోగి జీవితాన్ని కాపాడవచ్చు. ఈ పనిని ఇంజెక్షన్ ద్వారా లేదా యాంజియోప్లాస్టీ ద్వారా చేస్తారు. అటువంటి పరిస్థితిలో కార్డియాలజిస్ట్ బాధితుడిని మరణం నుండి రక్షించగలరు. చాలా మంది రోగులు గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే మరణిస్తారు. గుండెపోటులో 50 శాతం మొదటి గంటలోనే సంభవిస్తాయి. అందువల్ల, మొదటి గంటలో దానిని గుర్తించడం.. చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి లక్షణాలను గుర్తించడం.. వెంటనే ఈ రోగిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం.

చికిత్స ఎలా ఉండాలి?

గుండెపోటు వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. దీనిపై డాక్టర్ సంజయ్ త్యాగి సలహా ఇచ్చారు. గుండెపోటు వచ్చిన వెంటనే మొదట ఆస్పిరిన్ మాత్రను అందించాలి. బాధితుడు పెద్ద ఆసుపత్రి లేదా క్యాథ్ ల్యాబ్ లేని గ్రామంలో ఉంటే.. అతనికి ముందుగా  ఇంజెక్షన్ ద్వారా కొంత వరకు రక్షించవచ్చు. ప్రారంభ చికిత్స సమయంలో ఇంజెక్షన్ సుమారు 1% నుంచి 60-70 శాతం వరకు సక్సెస్ ఉంటుంది. యాంజియోప్లాస్టీ 90% కంటే ఎక్కువ విజయవంతమైంది.

ఇవి కూడా చదవండి: Leander Paes – TMC: గోవా రాజకీయాల్లో మరో సంచలనం.. టీఎంసీలో చేరిన టెన్నిస్ స్టార్ ప్లేయర్

Facebook Smartwatch: ఆపిల్ వాచ్‌కు పోటీగా మెటా స్మార్ట్‌వాచ్‌.. ఇందులోని అద్భతమైన ఫీచర్స్ ఇవే..