Leander Paes – TMC: గోవా రాజకీయాల్లో మరో సంచలనం.. టీఎంసీలో చేరిన టెన్నిస్ స్టార్ ప్లేయర్
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. గోవాలో మమతా బెనర్జీ సమక్షంలో పేస్ టీఎంసీలో చేరారు. ఈ కార్యక్రమంలో...
Leander Paes joined TMC: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. గోవా పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ సమక్షంలో పేస్ టీఎంసీలో చేరారు. రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీని బలోపేతం చేసేందుకు మమతా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పేస్ పార్టీలో చేరిన సంర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తనకు తమ్ముడిలాంటివాడని అన్నారు. ‘లియాండర్ పేస్ టిఎంసిలో చేరారని తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతను నాకు తమ్ముడిలాంటివాడు. నేను యువజన మంత్రిగా ఉన్నప్పటి నుండి నాకు తెలుసు.. అతను చాలా చిన్నవాడు. అంటూ పొగడ్తలతో ముంచేశారు.
2022 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గోవాలో తన పట్టును పటిష్టం చేసుకునేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోంది. మమతా బెనర్జీ ఒక రోజు ముందుగా అంటే గురువారం సాయంత్రం గోవా చేరుకున్నారు. ఆ తర్వాత బీజేపీ కంచుకోటలో అడుగుపెట్టాలనే ఆశతో టీఎంసీ ఎన్నికల రాష్ట్రంలో ప్రచారం మొదలు పెట్టింది. అంతకుముందు శుక్రవారం గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి నఫీసా అలీ కూడా TMCలో చేరారు.
Warmly welcoming legendary sportsperson @Leander who joined us today in the presence of our Hon’ble Chairperson @MamataOfficial!#GoenchiNaviSakal https://t.co/o05ddcH0Qb pic.twitter.com/PRgqvVhp1R
— AITC Goa (@AITC4Goa) October 29, 2021
TMC తన కొత్త సభ్యుడు లియాండర్ పేస్‌ను అధికారిక ట్విట్టర్ పోస్ట్ ద్వారా స్వాగతించారు. “ఈ రోజు మా గౌరవనీయ అధ్యక్షురాలు మమత సమక్షంలో లియాండర్ మా పార్టీలో చేరినట్లు తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ దేశంలోని ప్రతి వ్యక్తి 2014 నుండి మనం ఎదురుచూస్తున్న ప్రజాస్వామ్యం ఉషస్సును చూసేలా మేము అందరం కలిసి చూస్తాము. అంటూ కామెంట్ జోడించారు.
అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా రాయ్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణి కూడా బుధవారం టీఎంసీలో చేరారు. కామాక్ స్ట్రీట్‌లోని సెనేటర్ హోటల్‌లో టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ, ఎమ్మెల్యే వివేక్ గుప్తా సమక్షంలో కృష్ణ కళ్యాణి టీఎంసీలో చేరారు. కృష్ణ కళ్యాణి ఈ నెల ప్రారంభంలో బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: Facebook Smartwatch: ఆపిల్ వాచ్‌కు పోటీగా మెటా స్మార్ట్‌వాచ్.. ఇందులోని అద్భతమైన ఫీచర్స్ ఇవే..
Dinesh Karthik: అభిమానులకు ‘డబుల్’ ధమాకా న్యూస్ చెప్పిన దినేష్ కార్తీక్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..