AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dinesh Karthik: అభిమానులకు ‘డబుల్’ ధమాకా న్యూస్ చెప్పిన దినేష్ కార్తీక్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

లైఫ్ పిచ్‌పై క్రికెటర్ దినేష్ కార్తీక్ ప్రమోషన్ కొట్టేశాడు. కవలలకు తండ్రి అయ్యాడు. ఆడుతున్న దినేష్ కార్తీక్ భార్య భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ తన సోషల్ మీడియా వేదకగా ఈ సంగతిని..

Dinesh Karthik: అభిమానులకు ‘డబుల్’ ధమాకా న్యూస్ చెప్పిన దినేష్ కార్తీక్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Dinesh Karthik Became The F
Sanjay Kasula
|

Updated on: Oct 28, 2021 | 9:25 PM

Share

లైఫ్ పిచ్‌పై క్రికెటర్ దినేష్ కార్తీక్ ప్రమోషన్ కొట్టేశాడు. కవలలకు తండ్రి అయ్యాడు. ఆడుతున్న దినేష్ కార్తీక్ భార్య భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ తన సోషల్ మీడియా వేదకగా ఈ సంగతిని వెల్లడించారు. తమ పిల్లలకు బ్లెస్ చేయాలంటూ కోరారు. దినేష్ కార్తీక్ తన చిన్నారులతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అంతటితో ఆగని కార్తీక్ తన ఇద్దరు కొడుకుల పేర్లు కూడా ప్రకటించాడు. తమ కొడుకులలో ఒకరికి కబీర్ పల్లికల్ కార్తీక్, మరొకరికి జియాన్ పల్లికల్ కార్తీక్ అని నామకరణం చేశాడు. అంటే పిల్లల ఇంటిపేరు తల్లి, తండ్రి ఇద్దరి కలయికను గుర్తు చేసేలా ఉన్నాయి.

KKR కార్తీక్‌ను అభినందించాడు

దినేష్ కార్తీక్‌ను అభినందించింది  IPL ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్). ఇద్దరు కొత్త సభ్యులతో మా KKR కుటుంబం పెరిగిందని ట్వీట్ చేసింది.

2015లో పెళ్లయింది భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ , స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ 2013లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ 2015లో హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వివాహమైన 6 సంవత్సరాల తరువాత వారు ఇప్పుడు కవలల తల్లిదండ్రులు అయ్యారు. కార్తీక్ రెండో భార్య దీపిక. అంతకుముందు 2012లో తన మొదటి భార్య నికితాతో విడాకులు తీసుకున్నాడు.

దినేష్ కార్తీక్ భారతదేశం తరపున 26 టెస్టులు, 94 ODIలు, 32 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు, అందులో అతను 3000 పైగా పరుగులు చేశాడు. అతను చివరిసారిగా 2019లో భారత్ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో 200కు పైగా మ్యాచ్‌లు ఆడిన అతను 4000కు పైగా పరుగులు చేశాడు. ఇంతలో, దాని సగటు 25 కంటే ఎక్కువగా ఉంది. స్ట్రైక్ రేట్ 129 కంటే ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి: Chat Without Internet : ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌ చాట్ చేయండి.. ఎలానో తెలుసా..

Prashant Kishor: మరో 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. సమస్యంతా రాహుల్ గాంధీలోనే.. హాట్ కామెంట్ చేసిన పీకే..