Ind Vs Pak: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‎లో భారత్, పాకిస్తాన్ తలపడితే చూడాలని ఉంది.. పాక్ కోచ్ సక్లైన్ ముస్తాక్..

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తమ జట్టు భారత్‌తో తలపడినట్లయితే అది "గొప్ప విషయం" అని పాకిస్తాన్ ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్ గురువారం అన్నారు. భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల మధ్య స్నేహ భావం నెలకొనడంపై ఆనందం వ్యక్తం చేశాడు...

Ind Vs Pak: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‎లో భారత్, పాకిస్తాన్ తలపడితే చూడాలని ఉంది.. పాక్ కోచ్ సక్లైన్ ముస్తాక్..
Pak
Follow us

|

Updated on: Oct 28, 2021 | 9:15 PM

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తమ జట్టు భారత్‌తో తలపడినట్లయితే అది “గొప్ప విషయం” అని పాకిస్తాన్ ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్ గురువారం అన్నారు. భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల మధ్య స్నేహ భావం నెలకొనడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. రెండు వైపులా ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిని చాటారని అన్నారు. శుక్రవారం జరగబోయే పాక్‌- ఆఫ్గాన్‌ల మ్యాచ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమాశంలో ముస్తాక్ మాట్లాడు. ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌లో మీ చిరకాల ప్రత్యర్థితో మరో మ్యాచ్ కావాలా అని అతన్ని ప్రశ్నించగా “భారత్ ఫైనల్‌కు చేరితే, అది గొప్ప విషయం అని నేను భావిస్తున్నానని.. ఇది మేము వారిని ఓడించినందుకు కాదని, వారు బలమైన జట్టు, ప్రతి ఒక్కరూ వారిని అభిమానంగా భావిస్తారని” అన్నారు.

“రిలేషన్ ఔర్ అచ్చే హో జాంగే (మరో మ్యాచ్ ఆడటం మా సంబంధాలను మెరుగుపరుస్తుంది)తో మ్యాచ్ ఖేలేంగే. “గత మ్యాచ్‎లో విరాట్ కోహ్లీ, ధోనీ, పాక్ ఆటగాళ్లు ప్రవర్తించిన విధానం బలమైన సందేశాన్ని పంపిందని” అన్నారు. మనమందరం మనుషులం, మనమందరం ఒకరినొకరు ప్రేమిస్తాము, ఇది కేవలం ఒక ఆట మాత్రమే” అని చెప్పాడు. “సందేశాన్ని పంపినందుకు ఆటగాళ్లకు హ్యాట్సాఫ్. దోస్తీ కీ జీత్ హో, దుష్మణి కి హార్ హో (స్నేహం గెలవాలి, శత్రుత్వం ఓడిపోవాలి)” అని పేర్కొన్నాడు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ టైటిల్‌ ఫేవరేట్‎గా ఉందని తెలిపాడు. టోర్నీలో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లను కూడా తాము బలమైన జట్లుగానే భావిస్తున్నామని ముస్తాక్ చెప్పాడు. భారత్ ఫైనల్స్‌కు చేరితే, ఐసీసీ సంతోషిస్తుంది, అభిమానులు సంతోషిస్తారు” అని అన్నాడు. ఆదివారం జరిగే రెండో సూపర్ 12 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.

పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎లో న్యూజిలాండ్ ఓడిపోయింది. గ్రూప్-2లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఆప్ఘానిస్తాన్ రెండో స్థానంలో ఉండగా న్యూజిలాండి, భారత్ మూడు, నాలుగు స్థానాల్లో ఉంది. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ ఇండియా, కీవిస్‎కు ముఖ్యగా మారింది. ఈ మ్యాచ్‎లో గెలిస్తేనే భారత్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.

Read Also.. Ind Vs Pak: విరాట్ కోహ్లీ అలా అనడం బాధించింది.. జడేజా సంచలన వ్యాఖ్యలు..

Ind Vs Pak: హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ మధ్య ట్విట్టర్ వార్.. పాత వీడియోలు పోస్టు చేస్తున్న మాజీ ఆటగాళ్లు..