David Warner: ఐపీఎల్ 2022 వేలంలో నా పేరు ఉండబోతుంది.. డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2022 ఐపీఎల్ సీజన్ మెగా వేలంలో తన పేరును వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తనను రిటైన్ చేసుకునే అకాశం లేనందున తనను తాను తిరిగి ఐపీఎల్ వేలం పూల్‌లోకి వస్తా అని చెప్పాడు...
ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2022 ఐపీఎల్ సీజన్ మెగా వేలంలో తన పేరును వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తనను రిటైన్ చేసుకునే అకాశం లేనందున తాను తిరిగి ఐపీఎల్ వేలం పూల్‌లోకి వస్తా అని చెప్పాడు. వార్నర్ 2016లో సన్‌రైజర్స్‌కు తొలి టైటిల్‌ను అందించాడు. కానీ ఐపీఎల్ 2021 సీజన్‌లో వార్నర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించింది. వార్నర్ బ్యాటింగ్‌లోనూ రాణించలేదు. దీంతో అతన్ని చివరి ఆరు మ్యాచ్‌ల్లో తుది జట్టులోకి తీసుకోలేదు. ఐపీఎల్ సెకండ్‌ఫేజ్‌లో వార్నర్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. వార్నర్ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి195 పరుగులు మాత్రమే చేశాడు. “నేను నా పేరును వేలంలో ఉంచుతాను. ఇటీవలి ఐపీఎల్ ఫామ్ ప్రకారం, నన్ను సన్‌రైజర్స్ ఉంచుకోలేదు. కాబట్టి నేను కొత్త ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాను” అని వార్నర్ SEN రేడియోతో అన్నారు.
సన్‌రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్‌కు దూరంగా ఉండటం “కఠినమైన విషయం” అని వార్నర్ అన్నాడు. డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో ఆడుతున్నాడు. అక్టోబర్ 23న దక్షిణాఫ్రికతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ ఆకట్టులేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రిక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. మక్రమ్ 36 బంతుల్లో 40 పరుగులు చేశాడు. రబాడ 23 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో హజ్లేహుడ్, జంపా, స్టార్క్ రెండు వికెట్లు చొప్పున తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. స్టీవ్ స్మిత్ 34 బంతుల్లో 35 పరుగులు చేయగా స్టోయినిస్ 16 బంతుల్లో 24 పరుగులు చేశాడు.
Read Also.. Ind Vs Pak: విరాట్ కోహ్లీ అలా అనడం బాధించింది.. జడేజా సంచలన వ్యాఖ్యలు..
T20 World Cup 2021: అదిరిపోయే సిక్స్ కొట్టిన జాసన్ రాయ్.. వీడియో పోస్ట్ చేసిన ఐసీసీ..