Ind Vs Pak: విరాట్ కోహ్లీ అలా అనడం బాధించింది.. జడేజా సంచలన వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అత్యుత్తమంగా ఆడలేదని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. టాస్ ఓడిన తర్వాత విరాట్ కోహ్లీ అండ్ కోను మొదట బ్యాటింగ్ చేయమని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కోరాడు..
టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అత్యుత్తమంగా ఆడలేదని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. టాస్ ఓడిన తర్వాత విరాట్ కోహ్లీ అండ్ కోను మొదట బ్యాటింగ్ చేయమని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కోరాడు.. ఇది కూడా మ్యాచ్ ఓడిపోడానికి ఓ కారణమని చెప్పాడు. పాకిస్తాన్ పేసర్ షాహీన్ ఆఫ్రిది రోహిత్ శర్మను గోల్డెన్ డక్‌గా ఔట్ చేశాడని.. వెంటనే కేఎల్ రాహుల్‌ను కూడా పెవిలియన్ చేర్చాడని అన్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టు కష్టల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ప్రయత్నించాడని… 57 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత జట్టు 20 ఓవర్లలో 151 పరుగులు చేసిందని చెప్పాడు. కానీ పాకిస్తాన్‌కు 152 లక్ష్యం సరిపోలేదని పేర్కొన్నాడ.
పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ వరుసగా 79*, 68* పరుగులు చేసి తమ జట్టుకు 13 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకున్నారని గుర్తు చేశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ పాకిస్తాన్ విజయాన్ని కొనియాడాడని… చిరకాల ప్రత్యర్థిచే తన జట్టును అధిగమించిందని అంగీకరించాడని.. ఈ వ్యాఖ్యలు నిరాశకు గురిచేశాయని అజయ్ జడేజా అన్నాడు. “ఆ రోజు విరాట్ కోహ్లీ ప్రకటన విన్నాను. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు కోల్పోయినప్పుడు మేము వెనుకబడ్డామని అతను చెప్పాడు. దానితో నేను నిరాశ చెందాను” అని జడేజా క్రిక్‌బజ్ హిందీ లైవ్‌లో అన్నారు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు పుంజుకుని విజయం సాధించాలని జడేజా ఆకాంక్షించాడు.
న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 మ్యాచ్‌కి భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. నెట్స్‌లో చెమటోర్చుతున్నారు. వారు ప్రాక్టిస్ చేస్తున్న ఫొటోలను భారత క్రికెట్ జట్టు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి కొందరు క్రికెటర్లు “ఫన్ డ్రిల్”లో పాల్గొన్నట్లు ఫొటోలో కనిపించింది.
Read Also.. IND vs PAK Match: పాకిస్తాన్ విజయంపై సంబరాలు.. ముగ్గురు కాశ్మీరి విద్యార్థుల అరెస్ట్..