Quinton De Kock: “నేను జాత్యాహంకారుడిని కాదు”.. సహచరులకు క్షమాపణలు చెప్పిన క్వింటన్ డి కాక్..
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ గురువారం తన సహచరులకు క్షమాపణలు చెప్పాడు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు మోకాలి నిల్చోని ఉద్యమానికి మద్దతు తెలుపుతానని చెప్పాడు...
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ గురువారం తన సహచరులకు క్షమాపణలు చెప్పాడు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు మోకాలి నిల్చోని ఉద్యమానికి మద్దతు తెలుపుతానని చెప్పాడు. 32 ఏళ్ల అతను దక్షిణాఫ్రికా తరఫున ఆడాలనే తన కోరికను పునరుద్ఘాటించాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై పలువురు ఆటగాళ్లు మద్దతు తెలుతున్నారు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్‌ఏ) మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. అయితే ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ఏ చివరి అవకాశం ఇవ్వడంతో తాజాగా అతను క్షమాపణలు చెప్పాడు.
“నేను నా సహచరులు, అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను. జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేయడాన్ని నేను అర్థం చేసుకున్నాను. నేను మోకాలిపై నిల్చోవడం ఇతరులకు అవగాహన కల్పించడంలో సహాయపడితే నాకు సంతోషమే. ముఖ్యంగా వెస్టిండీస్ జట్టుతో ఆడకుండా ఎవరినీ అగౌరవపరచాలని నేను ఏ విధంగానూ అనుకోలేదు. నేను కలిగించిన అసౌకర్యానికి ప్రగాఢంగా చింతిస్తున్నాను” అని అన్నాడు. “ఈ సమస్యపై నేను ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. కానీ నేను కొంచెం వివరించాలని భావిస్తున్నాను. నేను మిశ్రమ జాతి కుటుంబం నుండి వచ్చాను. ప్రజలందరి హక్కులు, సమానత్వం వ్యక్తి కంటే ముఖ్యమైనవి” అని చెప్పాడు.
“నేను జాత్యహంకారుడినైతే, నేను సులభంగా మోకాలి నిల్చోని అబద్ధం చెప్పగలను, ఇది తప్పు. నాతో పెరిగి నాతో ఆడుకున్న వాళ్లకు నేను ఎలాంటి వ్యక్తినో తెలుసు. క్రికెటర్‌గా నన్ను చాలా మంది పిలుస్తారు. అపార్థం కారణంగా జాత్యహంకారిగా పిలవడం నన్ను తీవ్రంగా బాధించింది. ఇది నా కుటుంబాన్నీ బాధిస్తుంది. ఇది నా గర్భిణి భార్యను బాధిస్తుంది. నేను జాత్యహంకారిని కాదు. అది నా హృదయానికి తెలుసు” అని అన్నారు. నేను నా సహచరుల్లో ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నాను. దక్షిణాఫ్రికా కోసం క్రికెట్ ఆడటం కంటే నాకు మరేమీ ఇష్టం లేదని డికాక్ స్పష్టం చేశాడు.
Read Also.. T20 World Cup 2021: ప్రాక్టిస్ సెషన్లో చెమటోర్చిన భారత ఆటగాళ్లు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..