T20 World Cup 2021: ప్రాక్టీస్ సెషన్లో చెమటోర్చిన భారత ఆటగాళ్లు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..
టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 మ్యాచ్‌కి భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. నెట్స్‌లో చెమటోర్చుతున్నారు. వారు ప్రాక్టిస్ చేస్తున్న ఫొటోలను భారత క్రికెట్ జట్టు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు...
టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 మ్యాచ్‌కి భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. నెట్స్‌లో చెమటోర్చుతున్నారు. వారు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను భారత క్రికెట్ జట్టు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి కొందరు క్రికెటర్లు “ఫన్ డ్రిల్”లో పాల్గొన్నట్లు ఫొటోలో కనిపించింది. ఈ పోస్ట్‌కు అభిమానులు కామెంట్ పెడుతున్నారు. కీవిస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాలని అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇండియా, న్యూజిలాండ్ తమ మొదటి మ్యాచ్‌ల్లో పాక్ చేతిలో ఓడిపోయాయి.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజం నేతృత్వంలోని పాక్ జట్టు 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసింది. ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వామ్ అద్భుత ఆడి ఆఫ్ సెంచరీలు చేశారు. అజామ్ 52 బంతుల్లో 68 పరుగులు చేయగా, రిజ్వాన్ 55 బంతుల్లో 79 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ (49 బంతుల్లో 57పరుగులు) రాణించడంతో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌తో నిష్క్రమించడంతో భారత్ టాప్ ఆర్డర్ పతనానికి ప్రారంభమైంది. కేఎల్ రాహుల్ ఎనిమిది బంతుల్లో మూడు పరుగులు చేసి ఔటయ్యాడు.
కోహ్లితో పాటు, రిషబ్ పంత్ కూడా 30 బంతుల్లో 39 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. హసన్ అలీ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం గ్రూప్-2లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉండగా, భారత్ ఐదో స్థానంలో ఉంది.
View this post on Instagram
Read Also.. T20 World Cup: ఈ తప్పులు చేస్తే ప్రపంచకప్‌పై టీమిండియా ఆశలు వదులుకోవాల్సిందే.! అవేంటంటే..