- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2021: India Vs New Zealand Key Match In Group To Keep Team India Alive In Tournament
T20 World Cup: ఈ తప్పులు చేస్తే ప్రపంచకప్‌పై టీమిండియా ఆశలు వదులుకోవాల్సిందే.! అవేంటంటే..
టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. ఎన్నో సంచలనాలు.. ఆపై మరిన్ని వివాదాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం...
Updated on: Oct 28, 2021 | 11:52 AM

టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. ఎన్నో సంచలనాలు.. ఆపై మరిన్ని వివాదాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూపర్ 12 జరుగుతుండగా.. ఒక్కో గ్రూప్ నుంచి 6 టీంలలో రెండు జట్ల చొప్పున.. కేవలం 4 టీంలు మాత్రమే సెమీఫైనల్స్‌కు చేరతాయి.

మొదటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చూపిస్తుందనుకున్న టీమిండియా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటా పేలవ ప్రదర్శన చూపించి.. పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. అటు పాక్ జట్టు మాత్రం రెండు విజయాలు సాధించి జోరు మీదుంది.

ఇదిలా ఉంటే.. అక్టోబర్ 31వ తేదీ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే.. సెమీస్‌కు వెళ్లడం కష్టతరమవుతుంది. అసలు భారత్ సెమీఫైనల్స్‌కు చేరాలంటే ఏం చేయాలి.?

ఒకవేళ గ్రూప్-బీలో ఉన్న ఆఫ్గనిస్తాన్, స్కాట్‌ల్యాండ్, నమీబియాలను టీమిండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఓడిస్తే.. అప్పుడు ఒక్కో టీంకు 6 పాయింట్లు వస్తాయి.

పాకిస్తాన్‌కు ఇప్పటికే 4 పాయింట్లు ఉండటంతో.. ఈ 6 పాయింట్లు కూడా జోడిస్తే.. 10 అవుతాయి. న్యూజిలాండ్‌కు 8 పాయింట్లు ఉంటాయి.

ఇక ఒకవేళ కివీస్‌పై భారత్ ఓటమిపాలైతే.. కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఈ లెక్కన పాకిస్తాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరుకుంటాయి. ఇక టీమిండియా సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా న్యూజిలాండ్ మ్యాచ్ గెలవాలి.

అలాగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి కోహ్లీసేన మరోసారి ఆ తప్పిదాలు చేయకూడదు. ఓపెనింగ్ చక్కటి భాగస్వామ్యం, మిడిల్ ఆర్డర్ నిలకడ, ఆరో బౌలర్.. స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉంటే ఖచ్చితంగా టీమిండియాదే విజయం. ఖచ్చితంగా కివీస్.. భారత్‌కు గట్టి పోటీ ఇస్తుంది.

ఓపెనింగ్ సరిగ్గా లేకపోయినా.. మిడిల్ ఆర్డర్‌లో కోహ్లీకి చక్కటి సహకారం అందించకపోయినా.. సరైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్, స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోతే ఇండియా ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. మొదటి మ్యాచ్‌లో జరిగిన ఈ 4 తప్పిదాలు పునరావృత్తం అయితే.. టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమణ తప్పదు.





























