- Telugu News Photo Gallery Cricket photos BCCI President Sourav Ganguly has decided to step down from Mohun Bagan director to avoid conflicts
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ కీలక నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా..! ఎందుకో తెలుసా?
IPL 2022: ఐపీఎల్ 2022లో 10 జట్లు రంగంలోకి దిగనున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లను విక్రయించడం ద్వారా బీసీసీఐ రూ.12,715 కోట్లు ఆర్జించింది.
Updated on: Oct 27, 2021 | 7:59 PM

IPL 2022

నిజానికి, సౌరవ్ గంగూలీ ఏటీకే (ATK) మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్‌లో లక్నో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ATK మోహన్ బగన్ RPSG యాజమాన్యంలోనే ఉంది.

సౌరవ్ గంగూలీ బీసీసీఐ విరుద్ధ ప్రయోజనాల వివాదాన్ని నివారించేందుకు మోహన్ బగన్‌ను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ESPN Cricinfo నివేదిక ప్రకారం, సౌరవ్ గంగూలీ మోహన్ బగన్‌లో తన పదవికి రాజీనామా చేయాలిని నిర్ణయించుకున్నాడు.

సౌరవ్ గంగూలీ మోహన్ బగాన్ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లో షేర్లు కూడా ఉన్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగే వరకు గంగూలీ మోహన్ బగాన్‌లో తన బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. బీసీసీఐ అధ్యక్షుడి పదవీకాలం ముగిసిన తర్వాత గంగూలీ మళ్లీ మోహన్ బగాన్‌లో చేరనున్నారు.

IPL బిడ్డింగ్‌లో చారిత్రాత్మక బిడ్ చేయడం ద్వారా RPSG లక్నో జట్టును సొంతం చేసుకుంది. RPSG లక్నో ఫ్రాంచైజీని రూ.7,090 కోట్లకు కొనుగోలు చేసింది. అదే సమయంలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది.





























