Exclusive: ఒకరిది మతోన్మాదం.. మరొకరిది దుస్సాహసం.. మూర్ఖత్వానికి పరాకాష్టలా మారిన ఆ ఇద్దరు.. అసలు వారెవరు.. ఏంటా కథ?
గత కొద్ది రోజులుగా దుస్సాహసం, మతోన్మాదానికి సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. మొదటి కేసు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్‌కి సంబంధించినది అయితే, రెండవది పాకిస్తాన్ గొప్ప పేస్ బౌలర్లలో ఒకరైన వకార్ యూనిస్‌తో ముడిపడి ఉంది.
Quinton de Kock- Waqar Younis: ధైర్యం, నిర్భయం పూర్తిగా రెండు విభిన్న లక్షణాలు. ధైర్యసాహసాలతోపాటు కత్తికి తెనే పూసిన మతోన్మాదం మూడో వర్గం. సమయం, ప్రదేశం, పరిస్థితులపై ఆధారపడి, కొందరు ఈ రకమైన మూర్ఖత్వాన్ని కూడా తమ అనుకూలంగా అభివర్ణించుకుంటారు. మరికొందరు దీనిని చాకచక్యం అని పిలుస్తారు. అయినప్పటికీ ఒక నిర్దిష్ట వర్గం మాత్రం దీనిని ధైర్యానికి పరాకాష్టగా పరిగణిస్తుంటారు. గత కొద్ది రోజులుగా దుస్సాహసం, మతోన్మాదానికి సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. మొదటి కేసు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్‌కి సంబంధించినది అయితే, రెండవది పాకిస్తాన్ గొప్ప పేస్ బౌలర్లలో ఒకరైన వకార్ యూనిస్‌తో ముడిపడి ఉంది.
వకార్ ప్రస్తుతం ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం లేదు. కానీ, అతను పాకిస్తానీ టీవీ ఛానెల్‌లలో క్రికెట్ చర్చలలో అర్థం పర్థంలేక మాట్లాడుతున్నాడు. ఇటీవల ఓ షోలో మాట్లాడుతూ.. వకార్ మహ్మద్ రిజ్వాన్ ‘హిందువుల ముందు మైదానంలో నమాజ్ చేయడం’ ద్వారా గొప్ప పని చేశాడని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ క్రికెట్‌లోని విద్యావంతుల విభాగానికి వకార్ యూనిస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, అయితే అతని ప్రకటన మరింత ఆశ్చర్యకరంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
ఇమ్రాన్ అడుగుజాడల్లో వకార్.. అయితే తన మాట ఎవరు వింటున్నారో వకార్‌కు బాగా తెలుసు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అదే పని చేస్తున్నాడు. దీనిని వకార్ అనుకరిస్తున్నాడు. క్రికెట్ కెరీర్ మొత్తంలో ఇమ్రాన్ ఖాన్ ‘ఉదారవాది’గా పేరు తెచ్చుకున్నాడు. కానీ, ఆలస్యంగా, అతను ఇస్లామిక్ కఠిన వైఖరిని అవలంబించాడు. ప్రస్తుతం వకార్ అదే వైఖరిని పాటించాడు. అతని కఠిన మాటలను ధైర్యసాహసాలకు తెనే పూసిన మతోన్మాదంతో పిలుస్తున్నారు. అయితే, ఇదంతా వార్తల్లో నిలిచేందుకేనని వకార్‌కు తెలుసు. ఇది మన దేశంలోని టీవీ ప్యానెలిస్ట్‌లందరికీ తెలిసిన బహిరంగ రహస్యం కూడా.
ఈ విషయాలను విస్మరించడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, అలా చేయడం క్రీడల్లో సాధ్యం కాకపోవచ్చు. క్రీడాకారుడిగా ఉన్న సమయంలో, వకార్ మైదానంలో నమాజ్ గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఇప్పుడు రిటైరయ్యాక వేరే ‘ఆట’లో కెరీర్ ని సాగించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. విషయం పెద్దది అవుతున్న తరుణంలో, మెల్కొని ఒక ట్వీట్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. అయితే భావోద్వేగాలకు లోనవుతున్న సమయంలో అలాంటి పదాలను ఎవరూ ఉచ్చరించకూడదు. కాబట్టి అతని క్షమాపణకు సంబంధించిన ప్రామాణికత అతనికి మాత్రమే తెలుసు.
క్వింటన్ డి కాక్ అర్థం లేని ఆలోచన.. వకార్ మూర్ఖత్వం కంటే ముఖ్యమైనది డి కాక్ అర్థం లేని నిర్ణయం. అతను నల్లజాతీయుల కోసం ‘మోకాలి మీద కూర్చోవడానికి’ బదులుగా జట్టు నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం అతని కెరీర్‌కు చాలా ఇబ్బందులు కలిగించవచ్చు. నిజానికి, నేటి ప్రపంచంలో వర్ణవివక్షకు చోటు లేదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో దీని నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఇలాంటి సంఘటన జరిగితే, దాని మూలాన్ని ప్రపంచం తప్పక తెలుసుకోవాలి. డి కాక్ ఎప్పుడూ ఇలాంటి వాటికి వ్యతిరేకం. ఆయన మాటలు రాజకీయ ప్రేరేపితమని ప్రజలు భావించినప్పటికీ, వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కు అని ఆయన అభిప్రాయపడ్డారు. అదే కసరత్తు చేస్తున్నాడు.
వర్ణవివక్షపై దక్షిణాఫ్రికా క్రికెట్.. ఇది తెలియాలంటే ముందుగా దక్షిణాఫ్రికాను అర్థం చేసుకోవాలి. అక్కడ వర్ణవివక్ష చాలా కాలంగా అమలులో ఉంది. ప్రపంచం మొత్తం దక్షిణాఫ్రికాను స్పోర్ట్స్ డామినియన్ నుంచి దూరం చేసింది. 1991-92లో క్రికెట్ ఆడటం తిరిగి ప్రారంభించారు. దక్షిణాఫ్రికా వర్ణవివక్షకు దూరంగా ఉన్నారని భావించారు. కానీ, కొన్ని పాయింట్లు పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. 1994 తర్వాత దాదాపు 65 శాతం శ్వేతజాతీయులు క్రికెట్ ఆడారు. దక్షిణాఫ్రికా దేశ జనాభాలో కేవలం ఎనిమిది శాతం మాత్రమే ఉన్నారు. నల్లజాతీయుల ప్రాతినిధ్యం కేవలం 10 శాతం మాత్రమే అయినప్పటికీ.. వారు జనాభాలో 80 శాతం ఉన్నారు.
ఇటీవల, ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఒక సర్వేలో, నల్లజాతీయులలో ఎనిమిది శాతం మంది విద్యార్థులకు మాత్రమే పాఠశాలలో క్రీడలు అందుబాటులో ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కలతో వర్ణవివక్ష భయానక వాస్తవికతను ఊహించుకోవచ్చు. ఈ వివక్షను తొలగించడానికి, నల్లజాతి ఆటగాళ్లకు కూడా ప్రత్యేక కోటా ప్రవేశపెట్టారు. ఒక సీజన్ కోటాలో కేవలం ఆరుగురు వ్యక్తులు లేదా నల్లజాతీయులకు మాత్రమే చోటిచ్చారు. వీరిలో ముగ్గురు నల్ల జాతీయులై ఉండాలి. 2022-23 నుంచి ఈ కోటాను ఏడుకు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. కోటా పెంపు వల్ల ప్రతి మ్యాచ్‌లో 33 శాతం నల్ల జాతీయులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
కోటా వర్సెస్ మెరిట్.. చర్చలన్నీ ఈ కోటా నిబంధనల చుట్టూనే కేంద్రీకృతమై ఉన్నాయి. మన దేశంలోనూ దళితుల హక్కులపై ఇదే విషయమై చర్చ నడుస్తోంది. భారత క్రీడల్లో కోటా విధానం లేదు. ఈ చర్చలు తరచుగా ప్రభుత్వ ఉద్యోగాల చుట్టూ తిరుగుతుంటాయి. దక్షిణాఫ్రికా పరిస్థితులకు భారత్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నమైన మాట అనేది వాస్తవమే. కానీ, కొన్ని ఉదాహరణల సహాయంతో ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా సులభం.
కోటా వర్సెస్ మెరిట్ చర్చ సమీప భవిష్యత్తులో ముగుస్తుందేమో చూడాలి. ఈ విషయంలో దక్షిణాఫ్రికా కూడా అంత భిన్నంగా ఏమీ లేదు. చాలా మంది శ్వేతజాతీయులు ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉండాలని వాదించారు. వారు 50 ఏళ్ల అణచివేతను త్వరగానే మర్చిపోయారు. కొంతమంది నల్లజాతి ఆటగాళ్ల వాదనలు ఇందుకు భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ చర్చకు అనుకూలంగానే ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ మఖాయా ఎన్తిని ఒక ఇంటర్వ్యూలో నల్లజాతి ఆటగాళ్లు ప్రస్తుతం నిషేదించలేని అంశంగా మారారని పేర్కొన్నారు. వారి ఎంపిక కోటాపై ఆధారపడి ఉంటుందని, మెరిట్‌పై కాదనే ఊహల్లో ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి వాటిలో ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తున్నారో తెలుసుకోవచ్చు.
కోటా విధానం కారణంగా ఒక నిర్దిష్ట వ్యక్తి ఉద్యోగం లేదా పదోన్నతి పొందినట్లు భారతదేశంలో వినడం చాలా అరుదుగా వినిసిస్తోంది. దక్షిణాఫ్రికాలో, ఇది వారి మెరిట్ నుంచి జట్టులో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఆటగాళ్లకు సమస్యలను సృష్టిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటే, భారత క్రికెట్ జట్టులో కోటా విధానం ప్రవేశపెట్టబడిందని ఊహించుకోండి. పరిణామాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అదృష్టవశాత్తూ, భారతదేశంలో ఇలాంటివి ఏమీ జరగలేదు, జరగవచ్చని కూడా ఊహించలేదు. డికాక్ వంటి శ్వేతజాతీయుల ఆటగాళ్లు తమపై వివక్ష చూపుతున్నారని, ఎన్తిని వంటి ఆటగాళ్లు కష్టపడి పనిచేసినప్పటికీ తమకు గౌరవం ఇవ్వడం లేదని పేర్కొనడంతో అసలు ప్రశ్న తలెత్తుతుంది.
ఎన్తిని, పాల్ ఆడమ్స్‌ల వేదన.. ఎన్తిని తాను జట్టులో అణిచివేతకు గురయ్యానని పేర్కొన్నాడు. మరోవైపు పాల్ ఆడమ్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనను హోహా అని పిలిచినట్లు వెల్లడించాడు. అంటే ఆంగ్లంలో గట్టర్‌స్నిప్. స్పష్టంగా, శ్వేతజాతీయులకు చెందిన ఆటగాడు ఎప్పటికీ గట్టర్‌స్నిప్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వేలోని దాదాపు నల్లజాతి ఆటగాళ్లందరికీ ఇలాంటి గాథలు ఎన్నో ఉన్నాయి. ఈ వివక్షలో మార్పు తీసుకురావడానికి కోటా వ్యవస్థ నిజంగా సరైన మార్గమా? అనేది అతి పెద్ద ప్రశ్న?
భారతదేశంలో కూడా అణగారిన వర్గానికి మిగిలిన వారితో సమానంగా ఉండేలా ఒక వేదిక ఇవ్వాలని చాలా మంది నమ్ముతున్నారు. ఇందుకు విద్యే సరైన మార్గమని నమ్ముతుంటారు. అందుకే విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రివిలేజ్డ్ క్లాస్ లాగా వారి బాల్యంలో పుష్కలమైన అవకాశాలను పొందాలి. ఆ తర్వాత అన్నీ మెరిట్‌తో నిర్ణయించుకోవాలి. కానీ, దాని గురించి రాయడం చాలా సులభం. అదే వాస్తవంలో మాత్రం కనిపించదు. మరోవైపు, కోటా వ్యవస్థ ఎప్పుడూ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఏది ఏమైనా.. డి కాక్ చేసిన పనిని ఏ విధంగానూ సమర్థించలేం. అయితే దీనిని వ్యతిరేకిస్తున్న దక్షిణాఫ్రికా మొత్తం విషయాన్ని గుర్తుంచుకోవాలి. డికాక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనుందో చూడాలి మరి.
– శైలేష్ చతుర్వేది
Also Read: T20 World Cup 2021: అదిరిపోయే సిక్స్ కొట్టిన జాసన్ రాయ్.. వీడియో పోస్ట్ చేసిన ఐసీసీ..
Ind Vs Pak: విరాట్ కోహ్లీ అలా అనడం బాధించింది.. జడేజా సంచలన వ్యాఖ్యలు..