Prashant Kishor: మరో 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. సమస్యంతా రాహుల్ గాంధీలోనే.. హాట్ కామెంట్ చేసిన పీకే..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. రాహల్‌గాంధీ నాయకత్వ తీరును విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు పీకే.

Prashant Kishor: మరో 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. సమస్యంతా రాహుల్ గాంధీలోనే.. హాట్ కామెంట్ చేసిన పీకే..
Prashant Kishor
Follow us

|

Updated on: Oct 28, 2021 | 5:41 PM

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. రాహల్‌గాంధీ నాయకత్వ తీరును విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు పీకే. ప్రధాని మోడీని దేశ ప్రజలు ఓడిస్తారని.. బీజేపీని ప్రజలు మర్చిపోతారని రాహుల్‌ భ్రమపడుతున్నారని అన్నారు ప్రశాంత్‌ కిశోర్‌. కాంగ్రెస్‌తో  దెబ్బ తిన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. తన మాటల తూటాలను పేల్చారు.  రాబోయే అనేక దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్య శక్తిగా కొనసాగుతుందని జోస్యం చెప్పారు. గోవాలోని మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నట్లు నరేంద్ర మోడీని కానీ బీజేపీని కానీ ప్రజలు విసిరిపారేయడం జరగదని అన్నారు. బీజేపీ ప్రభావం మరో 30-40 ఏళ్ల వరకైనా ఉంటుందని ఆయన అంచనా వేశారు. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గ్రహించడం లేదని అదే అసలు సమస్య అని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ఇంధన ధరల పెరుగుదల పట్ల ప్రజల వైఖరిలో ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఎత్తిచూపారు.

సమావేశంలో ప్రశాంత్‌ కిశోర్‌  మాట్లాడుతూ.. ‘‘భారత రాజకీయాలను మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ ప్రభావితం చేస్తుంది. సరిగ్గా చెప్పాలంటే బీజేపీ కేంద్రంగానే భారత రాజకీయాలు కొనసాగుతాయి. స్వాతంత్ర్యానంతరం నుంచి 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఎలాంటి స్థానంలో ఉందో బీజేపీ మరికొన్ని దశాబ్దాల పాటు అలాంటి స్థానంలోనే ఉంటుంది. ప్రధానమంత్రి మోడీని ప్రజలు విసిరికొడతారని కొందరు అంటున్నారు. 30 శాతం ఓటు బ్యాంక్ సాధించిన ఏ పార్టీ అయినా ప్రజల నుంచి అంత తొందరగా పోదు. మోడీ ఉంటారా లేదా అనేది పక్కన పెడితే బీజేపీ మాత్రం ఉంటుంది. చాలా దశాబ్దాల పాటే ఉంటుంది. మరికొన్ని దశాబ్దాలు బీజేపీ చుట్టే రాజకీయం నడుస్తుంది’’.

జాతీయ స్థాయిలో 30 శాతం ఓట్లను దాటినందున కాషాయ పార్టీ తేలికగా కనుమరుగవుతుందని ఊహించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తగిన సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నమ్మడాన్ని తప్పుబట్టారు.

వాయనాడ్ ఎంపీతో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ఊహాగానాలు చెలరేగడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో లోతుగా పాతుకుపోయిన సమస్యలు.. నిర్మాణ సమస్యలకు పరిష్కారాలు లేవని కిషోర్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: YCP VS TDP: ఢిల్లీకి చేరిన ఏపీ ఫైట్.. అమిత్‌షాకు వైసీపీ, టీడీపీ ఎంపీల పోటా పోటీ ఫిర్యాదులు.. 

GHMC Transfer Twist: ఎల్‌బి నగర్‌ వెళ్లేందుకు విముఖత.. మళ్లీ కూకట్ పల్లిలోనే.. బదిలీలపై మళ్లీ కొత్త జీఓ..