GHMC Transfer Twist: ఎల్‌బి నగర్‌ వెళ్లేందుకు విముఖత.. మళ్లీ కూకట్ పల్లిలోనే.. బదిలీలపై మళ్లీ కొత్త జీఓ..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికారుల బదిలీలు అయోమయంగా మారాయి. కొందరు నారాజ్‌ కావడంతో మళ్లీ జీవోలు ఇవ్వాల్సి వచ్చిందంటున్నారు. కానీ..

GHMC Transfer Twist: ఎల్‌బి నగర్‌ వెళ్లేందుకు విముఖత.. మళ్లీ కూకట్ పల్లిలోనే.. బదిలీలపై మళ్లీ కొత్త జీఓ..
Mamatha
Follow us

|

Updated on: Oct 27, 2021 | 10:31 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికారుల బదిలీలు అయోమయంగా మారాయి. కొందరు నారాజ్‌ కావడంతో మళ్లీ జీవోలు ఇవ్వాల్సి వచ్చిందంటున్నారు. కానీ ప్రభుత్వం అబ్బే అదేం లేదు.. రిక్వెస్టే అంటున్నారు. గ్రేటర్ జోనల్ కమిషనర్ల ట్రాన్స్ఫర్ల మ్యాటర్ మలుపులు తిరిగింది. మంగళవారం నాలుగు జోన్లకు కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇంతవరకు భాగానే ఉంది. కానీ కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా ఉన్న మమతను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా బదిలీ చేశారు. అక్కడికి వెళ్లేందుకు ఆమె విముఖత చూపినట్లు తెలుస్తోంది. దీంతో మున్సిపల్ శాఖ మరో జీవో విడుదల చేయక తప్పలేదు.

అంతకుముందు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా ఉన్న రవి కిరణ్ ను ఖైరతాబాద్ జోనల్ కు, GHMC అడిషనల్ కమిషనర్ గా ఉన్న ప్రియాంకను శేరిలింగంపల్లి జోనల్ కు మార్చారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్ గా… కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా ఉన్న మమత ఎల్బీనగర్ జోనల్, GHMC అడిషనల్ కమిషనర్ పంకజను కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ జీవో 795 జారీ చేశారు.

అయితే జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ పంకజను రిక్వెస్ట్ మేరకు ఎల్బీనగర్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని.. దీంతో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా మమతను తిరిగి కొనసాగిస్తున్నట్లు జీవో 797 విడుదల చేశారు. పేరుకు రిక్వెస్టు అయినా.. ఉద్యోగ సంఘాల్లో యాక్టీవ్‌గా ఉండే మమత కూకట్ పల్లిని వీడేందుకు ఇష్టపడలేదని.. అందుకే మళ్లీ జీవో ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. జోనల్ కమిషనర్ మమత గతంలో కూడా డిప్యూటి కమిషనర్ హోదాలో ఉన్నప్పుడు చందానగర్ నుంచి జూబ్లీహిల్స్ కు ట్రాన్స్ఫర్ చేయగా అక్కడి వెళ్లేందుకు నిరాకరించారు. శేరిలింగంపల్లి బదిలీ చేయించుకున్నారు.

ఇవి కూడా చదవండి: LPG Gas Prices: దీపావళి ముందే గ్యాస్ బండకు రెక్కలు.. రూ.100 వరకు పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు..

Covid Lockdown: థర్డ్ వేవ్ భయాలు.. దేశంలోని ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్..