Covid Lockdown: థర్డ్ వేవ్ భయాలు.. దేశంలోని ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్..
మహమ్మారి మళ్లీ దడ పుట్టిస్తోంది. కేసుల పెరుగుదలతో అప్రమత్తమైంది మమతా సర్కార్. రాష్ట్ర రాజధానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ మున్సిపల్ కేంద్రంలో లాక్‌డౌన్ విధించారు. అటు వ్యాక్సినేషన్.. ఇటు లాక్‌డౌన్‌తో కరోనాకు కళ్లెం వేస్తోంది.
Covid Third Wave: కరోనా థర్డ్ వేవ్ ఇంకా పొంచే ఉందా? వరుసగా డబ్ల్యూహెచ్‌ఓ, ఎయిమ్స్ చేస్తున్న హెచ్చరికలు దేనికి సంకేతం? హార్డ్ ఇమ్యూనిటీ తగ్గిపోతుందా? నిజంగానే థర్డ్ వేవ్ రాబోతుందా? అలానే కనిపిస్తోంది తాజాగా కోవిడ్ లెక్కలు. మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దీంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తోంది బెంగాల్ ప్రభుత్వం. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. గత వారం రోజులుగా ఒక్కో జిల్లాలో చాలా కేసులు పెరుగుతున్నాయి.
కోవిడ్ -19 కేసుల పెరుగుదల మధ్య బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని సోనార్‌పూర్ మునిసిపాలిటీ ప్రాంతంలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్ విధించబడింది. సోనార్పూర్ రాజధాని కోల్‌కతా నుండి దాదాపు 20 కి.మీ మాత్రమే ఉంటుంది.
ఈ సమయంలో అత్యవసర సేవలు మాత్రమే పనిచేయడానికి అనుమతించారు. సోనార్‌పూర్ ప్రాంతంలో ఇప్పటివరకు 19 కంటైన్‌మెంట్ జోన్‌లను గుర్తించారు. దుర్గాపూజ ఉత్సవాల తర్వాత రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది.
దుర్గా పూజ నుండి కోల్‌కతాలో కోవిడ్ -19 కేసులు 25 శాతం పెరిగాయని లేఖలో ICMR పేర్కొంది. గత 24 గంటల్లో కోల్‌కతాలో మాత్రమే 248 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ -19 కొత్త కేసులు పూర్తిగా టీకాలు వేసుకున్న వారిలోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
కోవిడ్ కేసులతోపాటు మరణాలపై వెంటనే సమీక్షించవలసిందిగా కేంద్రం బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది ICMR. కోవిడ్-సురక్షిత, ఉత్సవాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.
ఇవి కూడా చదవండి: Ban Diwali Crackers: ఈ ఏడాది కూడా నిశ్శబ్ధ దీపావళినే.. అక్కడ ఇవాళ్టి నుంచి క్రాకర్స్ అమ్మడం, కాల్చడం నిషేధం..