New Variant Corona: దేశంలో కొత్త రకం కరోనా వైరస్.. గుర్తించిన వైద్యులు.. అక్కడ ఏడు కేసులు నమోదు..!
New Variant Corona: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతం చేసింది. వైరస్ అడ్డుకట్టకు చేపట్టిన..
New Variant Corona: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతం చేసింది. వైరస్ అడ్డుకట్టకు చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు సెకండ్ వేవ్ కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ఎంత అల్లాడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి, రెండు దశల్లో కరోనా విజృంభించింది. లాక్‌డౌన్, వ్యాక్సినేషన్, ఇతర చర్యల ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. దీంతో రెండవ దశ అత్యంత వేగంగా దూసుకు వచ్చి దేశ వ్యాప్తంగా పాకిపోయింది. ఈ క్రమంలోనే దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అదే సమయంలో దేశంలో ఆక్సిజన్ నిల్వలు కూడా పెరిగి పోవడం వల్ల మరణాల సంఖ్య కూడా తగ్గిపోయిందనే చెప్పాలి. కానీ మూడవ దశ ముంచుకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. పండగ సీజన్‌లు ఉండటంతో జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వైరస్ కారణంగా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలే బెంగళూరులో కొత్తరకం కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. నగరంలో రెండు ay. 4.2 రకం అనుమానిత కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. అయితే ఈ వైరస్ వేరియంట్ గుర్తించేందుకు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ కొత్త వైరస్ సోకిన ఇద్దరు బాధితులు కూడా బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఈ కొత్త వేరియంట్ యూకేలో ఎంతో వేగంగా విస్తరిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ వేరియంట్‌ను డెన్మార్క్, జర్మనీ, ఐర్లాండ్ వంటి యూరోపియన్ దేశాలలో కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా బెంగళూరులో రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణదీప్ మాట్లాడుతూ.. ఈ కొత్త వేరియంట్‌ను రాష్ట్రంలో ఏడు కేసులను గుర్తించినట్లు తెలిపారు. బెంగళూరులో మూడు ఉంగడా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు ఉన్నట్లు వెల్లడించారు. అయితే కొత్త వేరియంట్ వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో గుర్తించిన ఈ కొత్త వేరియంట్‌ను నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇది ఏ మేరకు విస్తరిస్తోంది.. ఎలాంటి ప్రభావం చూపుతుందని పరిశీలిస్తున్నారని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం తెలిపారు.
ఇవి కూడా చదవండి: Corona Virus: రష్యాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా భారీగా కేసులు నమోదు