Ban Diwali Crackers: ఈ ఏడాది కూడా నిశ్శబ్ధ దీపావళినే.. అక్కడ ఇవాళ్టి నుంచి క్రాకర్స్ అమ్మడం, కాల్చడం నిషేధం..
నో సౌండ్స్.. ఓన్లీ లైటింగ్స్.. అవును ఈ ఏడాది కూడా నిశ్శబ్ధ దీపావళినే. ఒక్కొక్కటిగా రాష్ట్రాలు బాణాసంచాపై నిషేధం విధిస్తున్నాయి. 15 రోజుల క్రితం ఢిల్లీ.. మొన్న రాజస్తాన్.. ఇవాళ మమతా పాలనలో ఉన్న బెంగాల్ కూడా అదే ఐడియాలజీలోకొచ్చేసింది.
నో సౌండ్స్.. ఓన్లీ లైటింగ్స్.. అవును ఈ ఏడాది కూడా నిశ్శబ్ధ దీపావళినే. ఒక్కొక్కటిగా రాష్ట్రాలు బాణాసంచాపై నిషేధం విధిస్తున్నాయి. 15 రోజుల క్రితం ఢిల్లీ.. మొన్న రాజస్తాన్.. ఇవాళ మమతా పాలనలో ఉన్న బెంగాల్ కూడా అదే ఐడియాలజీలోకొచ్చేసింది. క్రాకర్స్‌పై బ్యాన్ విధించింది. దీపావళి .. ఈసారి కూడా దీపావళికి నో క్రాకర్స్. కేవలం దీపాల వెలుగులు మాత్రమే ఉండాలని ఆదేశించింది. బాణా సంచా అమ్మినా.. కాల్చినా చర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది. పండుగల వేళ కరోనా విజృంభిస్తుందనే భయంతో క్రాకర్స్ కొనుగోళ్లు, అమ్మకాలపై బ్యాన్ విధించింది. ఇవాళ్టి నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చేశాయి.
ఫెస్టివల్స్ సీజన్‌లో థర్డ్ వేవ్ భయంతో పాటు ఎయిర్ పొల్యూషన్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రంలో ఇవాళ్లి నుంచి బాణాసంచా అమ్మడం, కాల్చడం, నిల్వచేయడాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు వెల్లడించారు. టపాసుల నుంచి వెలువడే కాలుష్యం ఊపిరితిత్తులపై పెను ప్రభావం చూపుతుందని.. ప్రజలు శ్వాసకోస సమస్యల బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. అయితే, గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడేందుకు అనుమతిస్తారు.
ఈ గ్రీన్ క్రాకర్స్‌ను కూడా కేవలం 2 గంటలపాటు కాల్చేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు.. చట్ పూజలో ఉదయం 6 నుండి 8 గంటల వరకు, క్రిస్మస్ , నూతన సంవత్సరం సందర్భంగా 35 నిమిషాల పాటు రాత్రి 11:55 నుండి 12:30 వరకు క్రాకర్లు పేల్చవచ్చని సూచించారు.
Only green crackers can be sold in West Bengal & bursting of such crackers shall be allowed for 2 hrs during Diwali from 8-10 pm, 2 hours during Chhatt Puja from 6-8 am and 35 minutes during Christmas & New Year’s eve from 11:55 pm to 12:30 am: West Bengal Pollution Control Board pic.twitter.com/k9AgOfccGK
— ANI (@ANI) October 27, 2021
బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ నిషేధం విధించినట్లుగా తెలిపారు. “ఫైర్ క్రాకర్స్ పేల్చడం వల్ల హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. హాని కలిగించే సమూహాల శ్వాసకోశ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది” ఇంట్లో ఒంటరిగా ఉన్న కోవిడ్ -19 రోగుల ఆరోగ్య పరిస్థితులను మరింత దిగజార్చవచ్చు అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోబడింది అని తాజాగా ప్రకటనలో పేర్కొన్నారు.
కరోనాతో ఇప్పటికే ప్రజల రోగనిరోధక శక్తి తగ్గిందని, అందుకే, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు క్రాకర్స్ కొనుగోళ్లతో మార్కెట్లలో ఏర్పడే రద్దీతో కొవిడ్ కేసులు పెరిగే ప్రమాదముందన్నారు.
ఇక ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకూ బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు సెప్టెంబర్ 15న ఉత్తర్వులు జారీ చేశారు సీఎం కేజ్రీవాల్. టపాసులు పేల్చడం వల్ల వాయు కాలుష్యం వల్ల పెరిగిపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.
బాణాసంచాపై సంపూర్ణ నిషేధం విధించినందువల్ల..ఎవరూ క్రాకర్స్ నిల్వ చేయవద్దని, అమ్మవద్దని కోరారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఇలాంటి చర్చలు తప్పవని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అయితే పండుగల వేళ ఇలా బాణసంచాపై నిషేధం విధించడం పట్ల స్థానిక బెంగాళీ ప్రజలు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Vijaya Sai Reddy: చంద్రబాబు కుట్రకు భయపడే పట్టాభి విదేశాలకు పారిపోయాడు: విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు