Vijaya Sai Reddy: చంద్రబాబు కుట్రకు భయపడే పట్టాభి విదేశాలకు పారిపోయాడు: విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijaya Sai Reddy on Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వచ్చారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అసాంఘీక శ‌క్తుల‌కు

Vijaya Sai Reddy: చంద్రబాబు కుట్రకు భయపడే పట్టాభి విదేశాలకు పారిపోయాడు: విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Vijaya Sai Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 27, 2021 | 1:08 PM

Vijaya Sai Reddy on Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వచ్చారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అసాంఘీక శ‌క్తుల‌కు రారాజైన చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వ‌చ్చారు.. ? వ్యవస్థల్ని మ్యానేజ్ చేయ‌డానికి వ‌చ్చారా లేక ఏపీ ప‌రువు తీశామ‌ని చెప్పుకోవ‌డానికి వ‌చ్చారా..? అంటూ విజ‌య‌సాయి రెడ్డి ధ్వజమెత్తారు. పట్టాభిని చంపేసి, ఆ నింద వైసీపీ మీద రుద్దగల సమర్ధుడు చంద్రబాబు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అందుకే పట్టాభి పారిపోయి విదేశాల్లో దాక్కున్నాడని ఆరోపించారు. పట్టాభి భయపడేది వైసీపీకి కాదని.. టీడీపీ అంటే భయమని పేర్కొన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనంతరం విజయసాయిరెడ్డి బుధవారం మాట్లాడారు. గతంలో చంద్రబాబు ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో ఢిల్లీ వచ్చారని.. అదే విధంగా ఓటుకు నోటు సమయంలో వచ్చారని.. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పాలంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో పార్టీ అధికార ప్రతినిధి పట్టాభితో తిట్టించిన వీడియో రాష్ట్రపతికి చూపించారా అంటూ ప్రశ్నించారు. తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్ మీద చేసిన దాడిని చూపించడానికి వచ్చారా అంటూ నిలదీశారు. ప్రతి మహానాడులో ఆర్టికల్ 356 ను రద్దు చేయమని తీర్మానం చేస్తూ వచ్చారు.. ఇప్పుడు అదే పార్టీ ఆర్టికల్ 356 అమలు చేయమని చెప్పడం ఎంతవరకు సమంజసమంటూ నిలదీశారు. 2019 తర్వాత టీడీపీ ఏ ఒక్క ఎన్నికల్లో కూడా గెలవలేదని.. అలాంటి పార్టీ అధినేత చంద్రబాబుకు ఎంత ప్రజాదరణ ఉందో అర్ధమవుతుందంటూ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు.. తక్కువ చేసి చూపుతూ సీఎం జగన్ మీద దుర్భాషలాడుతున్నారంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మీద అసభ్యంగా మాట్లాడితే ప్రజలు తిరగబడ్డారని.. ఇలాంటి ఘటనలు అనేక చోట్ల జరిగాయంటూ పేర్కొన్నారు. ప్రజలకు సెంటిమెంట్స్ ఉంటాయని తెలిపారు. అసభ్య భాష వాడితే జనంలో తిరుగుబాటు వస్తుందన్నారు. చంద్రబాబు చర్యల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.

2019కి ముందు మీ మంత్రి గంటా, అయ్యన్నపాత్రుడు చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకోండంటూ చంద్రబాబుకు సూచించారు. ఏపీలో గంజాయి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రులిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారన్నారు. ఇందులో లోకేష్ ప్రధాన సూత్రధారి అని అందరికీ తెలుసన్నారు. తన దొంగతనం బయటపడకుండా ఉండడం కోసం ఎదుటివారిపై బురదజల్లుతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారు. ఎప్పుడైనా తెగదెంపులు చేసుకుంటారు. ఒక నీతి, నిజాయితీ లేదంటూ మండిపడ్డారు. తన అనుచరులతో అసభ్య భాష వాడేలా చేస్తూ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా అసభ్య భాష వాడితే, ఆ పార్టీలు ఖండించాయి. కానీ, పట్టాభి విషయంలో చంద్రబాబు ఖండించలేదన్నారు. చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్ట్.. ఒక టెర్రరిస్ట్ సంస్థకు నాయకుడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకోవడమే బాబు లక్ష్యమన్నారు. ఇందుకోసం వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్నారు.

తమిళనాడులో ఉండే వ్యక్తి గుజరాత్ ముంద్రా పోర్ట్ ద్వారా ఆఫ్ఘన్ నుంచి డ్రగ్స్ తెప్పించి ఢిల్లీకి పంపిణీ చేస్తుంటే, ఏపీ చిరునామా సాకు చూపుతూ, ఏపీని బద్నాం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు. గత రెండ్రోజులుగా ఢిల్లీలో హోంమంత్రి సహా అందరినీ కలవాలని చూసారు. కానీ ఎవరూ అపాయిట్మెంట్ ఇవ్వలేదని.. చంద్రబాబు మోసం గురించి ఢిల్లీలో అందరికీ తెలుసన్నారు. న్యాయవ్యవస్థ గురించి దుర్భాషలాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంది. కానీ సామాన్యులపై దుర్భాషలాడితే ఐపీసీలో ఒక చిన్న సెక్షన్ తప్ప కఠిన చర్యలు తీసుకునే వెసులుబాటు లేదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని దూషిస్తే కఠిన చర్యలు తీసుకునే చట్టం తీసుకురావాలి. మేము దీనిపై పార్లమెంట్లో కూడా అడుగుతాం అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దని సూచించారు. దాడులను ప్రోత్సహించడం లేదని.. కానీ భావోద్వేగాలు రెచ్చగొడితే జనంలో ఒక్కోసారి స్పందన తీవ్రంగా ఉంటుందంటూ విజయసాయి రెడ్డి తెలిపారు.

Also Read:

Pegasus Spyware Case: పెగాసస్ స్పైవేర్ కేసు దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల స్వతంత్ర కమిటీ.. సుప్రీం కోర్టు కీలక తీర్పు!

India Covid-19: దేశంలో భారీగా తగ్గిన కేసులు.. భయాందోళన కలిగిస్తున్న మరణాలు.. నిన్న ఎన్నంటే..?