Tirupati: మలయప్ప స్వామికి సుమారు 1.8 కోట్ల విలువజేసే బంగారు బిస్కెట్స్ ను కానుకగా ఇచ్చిన శ్రీవారి భక్తుడు..
Tirupati: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రపంచ దేశాల నుంచి భక్తులు..
Tirupati: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రపంచ దేశాల నుంచి భక్తులు భారీగా విచ్చేస్తుంటారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయం భక్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది. మలయప్ప స్వామికి అలనాటి రాజుల నుంచి నేటి పాలకుల వరకూ బంగారం, వజ్ర వైడుర్యాల కానుకలను సమర్పిస్తూనే ఉన్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయనేతలు, వ్యాపారస్తులు శ్రీవారిని దర్శించుకుని తమ శక్తిమేరకు కానుకలను సమర్పిస్తారు. తాజాగా స్వామివారికి భక్తుడు బంగారు బిస్కెట్లను కానుకగా సమర్పించాడు. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన శ్రీవారి భక్తుడు 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళంగా ఇచ్చాడు. ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1.83 కోట్లు విలువైన బంగారు బిస్కెట్లు విరాళంగా ఇచ్చారు. ఈరోజు ఉదయం స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు బంగారు బిస్కెట్లు అందజేశారు.
Also Read: దీపావళి అలంకరణ కోసం ఇంట్లోనే అందమైన దీపాలు, వాల్ హ్యాంగింగ్స్.. సింపుల్ ఐడియాలు మీ కోసం