India Covid-19: దేశంలో భారీగా తగ్గిన కేసులు.. భయాందోళన కలిగిస్తున్న మరణాలు.. నిన్న ఎన్నంటే..?

India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన

India Covid-19: దేశంలో భారీగా తగ్గిన కేసులు.. భయాందోళన కలిగిస్తున్న మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Corona

India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) దేశవ్యాప్తంగా 13,451 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 585 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది

తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,15,653 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,55,653 కి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,62,661 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 242 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది.

నిన్న కరోనా నుంచి 14,021 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,35,97,339 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉంది. మార్చి తర్వాత కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,03,53,25,577 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. గత 24గంటల్లో 55,89,124 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Also Read:

Fuel Price Today: బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగరాల్లో రికార్డు స్థాయిలో..

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో..

Silver Price Today: వెండి ధరలకు బ్రేక్.. తటస్థంగానే రేట్లు.. ప్రధాన నగరాల్లో..

Click on your DTH Provider to Add TV9 Telugu