Lower Berth Ticket: రైల్లో లోయర్ బెర్త్ టికెట్ కన్ఫమ్ కావాలంటే ఏం చేయాలి? ఆ ట్రిక్ ఏంటంటే.!
సుదూర ప్రయాణాలు చేసే వారు సాధారణంగా రైల్లో వెళుతుంటారు. ట్రైన జర్నీ అయితేనే కంఫర్ట్‌గా ఉంటుందని ట్రెయిన్ టికెట్స్ బుక్ చేసుకుంటారు..
సుదూర ప్రయాణాలు చేసే వారు సాధారణంగా రైల్లో వెళుతుంటారు. ట్రైన జర్నీ అయితేనే కంఫర్ట్‌గా ఉంటుందని ట్రెయిన్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. కానీ.. చాలామంది ప్రయాణికులకు తాము ఆశించిన బెర్త్‌లు కన్ఫమ్ కావు. కొందరికి లోయర్ బెర్త్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ.. అందరికీ లోయర్ బెర్త్‌లు బుక్ కావు. కొందరికి మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, సైడ్ బెర్త్‌లు బుక్ అవుతుంటాయి. కుర్రాళ్ళకు ఏ బెర్త్ అయినా ఓకే కానీ.. సీనియర్ సిటిజన్స్‌కు మిడిల్, అప్పర్ బెర్త్ అంటే కష్టమే. మరి.. వాళ్లకు లోయర్ బెర్త్ ఖచ్చితంగా కన్ఫమ్ అయ్యేలా సీట్లు బుక్ చేసుకోవచ్చు. దాని కోసం ఏం చేయాలో చూద్దాం.
నిజానికి.. సీనియర్ సిటిజన్స్ కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా కొన్ని ఫెసిలిటీలను కల్పిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు లోయర్ బెర్త్‌ను కన్ఫమ్‌గా బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీనికి సంబంధించి ఓ ప్రయాణికుడు ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నకు ఇండియన్ రైల్వేస్ నుంచి రిప్లయి వచ్చింది. లోయర్ బెర్త్ సీటు కన్ఫమ్ కావాలంటే.. పురుషులు అయితే 60 ఏళ్లు పైబడి ఉండాలి. స్త్రీలు అయితే 45 ఏళ్లు పైబడి ఉండాలి. ఇద్దరు కానీ.. ఒక్కరు కానీ.. ఒకే టికెట్ మీద ప్రయాణిస్తే.. అప్పుడు వాళ్లకు లోయర్ బెర్త్‌లు ఖచ్చితంగా కన్ఫమ్ అవుతాయని రైల్వేస్ రిప్లయి ఇచ్చింది.
అంటే.. టికెట్ బుక్ చేసేటప్పుడు సీనియర్ సిటిజన్స్ వయసును ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే లోయర్ టికెట్స్ బుక్ అవుతాయి. ఈ ట్రిక్ తెలుసుకుంటే.. సీనియర్ సిటిజన్స్‌కు ఎప్పుడైనా లోయర్ టికెట్ బుక్ చేయొచ్చు. అలాగే.. సీనియర్ సిటిజన్స్ కోసమే అన్ని రైళ్లలో రైల్వే శాఖ కొన్ని టికెట్లను ప్రత్యేకంగా కేటాయించింది. అవి కేవలం వాళ్ళే బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఇవి చదవండి:
Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!
IPL 2022: వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..
Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..