AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

అమెరికాలో ఎలిగేటర్‌ మొస‌ళ్ళు భారీ ఆకారంతో భయం గొలుపుతాయి. దూరం నుంచి చూస్తేనే భ‌య‌ప‌డిపోతాం. మరి అంతటి భారీ ఆకారంతో...

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!
Crocodile Attack
Ravi Kiran
|

Updated on: Oct 26, 2021 | 7:25 PM

Share

అమెరికాలో ఎలిగేటర్‌ మొస‌ళ్ళు భారీ ఆకారంతో భయం గొలుపుతాయి. దూరం నుంచి చూస్తేనే భ‌య‌ప‌డిపోతాం. మరి అంతటి భారీ ఆకారంతో ఉన్న ఆ మొసలి మన దగ్గరలో కనిపిస్తే.. సరిగ్గా ఇలాంటి పరిణామమే ఓ వ్యక్తికి ఎదురైంది. ఇంచక్కా కొలనులో ఈత కొడుతున్న ఓ వ్యక్తిని అనుకోని అతిధిలా ఓ మొసలి వచ్చి పలకరించింది. ఆ వ్యక్తిపై మొసలి మెరుపు దాడి చేసింది. నీళ్లలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందంటారు. అలాంటిది వ్యక్తిపై దాడి చేస్తే ఇంకేమైనా ఉందా.. ప్రాణాల మీద ఆశ వ‌దులుకోవాల్సిందే. అసలు మొస‌లి ఒక్క‌సారి అటాక్ చేసిందంటే ఇక వ‌ద‌ల‌దు. ఏనుగునే త‌న బ‌లంతో లాగేంత శ‌క్తి దానికి ఉంటుంది.

వైరల్ వీడియో ప్రకారం.. చెరువులో ఈదుతున్న ఓ వ్య‌క్తిపై ఎలిగేటర్‌ అటాక్ చేసింది. ఈ ఘ‌ట‌న బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. ఓ టూరిస్ట్ ప్రాంతంలో ఉన్న చెరువులో ఓ వ్య‌క్తి ఈత కొడుతున్నాడు. వెనుక నుంచి వేగంగా పెద్ద మొస‌లి అత‌డి వైపు వ‌చ్చింది. మొస‌లి రావ‌డాన్ని ఆ వ్య‌క్తి చూడకపోగా.. మొసలి అతడిపై మెరుపు దాడికి దిగింది. అయితే చివర్లో దానికి నీటిలో ఏం అడ్డు తగిలిందో తెలియదు గానీ.. అది అక్కడే ఆగిపోతుంది. దీనితో ఆ వ్య‌క్తి మొసలి నుంచి సురక్షితంగా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే అతడికి ఈ దాడిలో ఎడ‌మ చేతికి గాయమైనట్లు వీడియోలో స్పష్టమవుతుంది. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..