Man falls from 19th floor: 19వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడ్డాడు.. వైరల్ అవుతున్న వీడియో..
ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో ఎటు పోవాలో దారి తెలియక ప్రమాదవశాత్తూ 19వ అంతస్తు నుంచి జారి పడి ఓ యువకుడు మరణించాడు. అగ్నికీలల నుంచి తప్పించుకోవడానికి...
ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో ఎటు పోవాలో దారి తెలియక ప్రమాదవశాత్తూ 19వ అంతస్తు నుంచి జారి పడి ఓ యువకుడు మరణించాడు. అగ్నికీలల నుంచి తప్పించుకోవడానికి చేసిన సాహసం అతని ప్రాణాలను కబళించింది.
ముంబై అవిఘ్న పార్కులోని 61 అంతస్తుల భవనంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. 19వ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడంతో.. అక్కడున్న ఓ 30 ఏళ్ళ యువకుడు అరుణ్ తివారీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ అంతస్తులోని బాల్కనీలోకి తివారీ వచ్చాడు. బాల్కనీ నుంచి కింది అంతస్తుకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో పట్టు కోల్పోయి కింద జారిపడ్డాడు. అతను చనిపోయాడని బీఎంసీ డిజాస్టర్ కంట్రోల్ అధికారులు ధ్రువీకరించారు.
దక్షిణ ముంబైలోని అవిఘ్న పార్కులోని 61 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు ఉదయం 11:55 గంటలకు బీఎంసీకి సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది.. 19వ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలను అదుపు చేసే పనిలో తలమునకలైంది. ఆ అంతస్తులో ఉన్న అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని బీఎంసీ కమిషనర్ తెలిపారు. ముంబై మేయర్ ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Singer Chitra: సింగర్ చిత్రకు అవార్డు .. షేక్ చేతుల మీదుగా యూఏఈ గోల్డెన్ వీసా..! (వీడియో)
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

