Swiggy women: మహిళలకు నెలసరి సెలవులు.. ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ నిర్ణయం.. (వీడియో)

ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తమ సంస్థలో పని చేసే డెలివరీ విమెన్‌కు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. నెలసరి వంటి వ్యక్తిగత సమస్యతో ఇబ్బంది పడాల్సి వచ్చిన డెలివరీ మహిళల సమస్యను అర్థం చేసుకుంది. ఆ రోజుల్లో సెలవు అడగాలంటే కారణం ఏం చెప్పాలో..

Swiggy women: మహిళలకు నెలసరి సెలవులు.. ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ నిర్ణయం.. (వీడియో)

|

Updated on: Oct 27, 2021 | 4:26 PM

ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తమ సంస్థలో పని చేసే డెలివరీ విమెన్‌కు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. నెలసరి వంటి వ్యక్తిగత సమస్యతో ఇబ్బంది పడాల్సి వచ్చిన డెలివరీ మహిళల సమస్యను అర్థం చేసుకుంది. ఆ రోజుల్లో సెలవు అడగాలంటే కారణం ఏం చెప్పాలో.. చెబితే ఏం అనుకుంటారో అన్న అనుమానం మహిళల్లో కలగడం సర్వసాధారణం. మహిళలకు ఎదురయ్యే ఈ ఇబ్బందిని అర్థం చేసుకున్న ‘స్విగ్గీ’ తమ వద్ద పనిచేసే డెలివరీ విమెన్‌ కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. మహిళా డెలివరీ పార్ట్‌నర్లకు ప్రతి నెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు స్విగ్గీ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిహిర్‌ షా తన బ్లాగ్‌ పోస్ట్‌లో ప్రకటన విడుదల చేశారు 
“నెలసరి సమయంలో బయటకు రావాలన్నా.. రోడ్లపై తిరగాలన్నా మహిళలు చాలా అసౌకర్యానికి గురవుతారు. డెలివరీని మహిళలు వృత్తిగా ఎంచుకోకపోవడానికి బయటి చెప్పుకోలేని ప్రధాన కారణం ఇది. అలాంటి మహిళలకు అండగా ఉండాలని మేం నిర్ణయం తీసుకున్నాం. మహిళలు ఒక అడుగు ముందుకేసినప్పుడు.. మనమెందుకు వేయకూడదు. అందుకే మా రెగ్యులర్‌ డెలివరీ విమెన్‌కు ప్రతినెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటించాం. ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఈ సెలవులను వారు ఉపయోగించుకోవచ్చు’’ అని రాసుకొచ్చారు.
స్విగ్గీ డెలివరీల కోసం 2016 నుంచి మహిళలను కూడా విధుల్లోకి తీసుకుంది. పుణెలో ఆరంభించి.. ఆ తర్వాత ఇతర ప్రధాన నగరాల్లోనూ డెలివరీ విమెన్‌ను తీసుకొచ్చింది. తాజా నిర్ణయంతో నెటిజన్లు స్విగ్గీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

RGV in AP Politics: ఏపీ పాలిటిక్స్‌లోకి వర్మ..! ఇక మామూలుగా ఉండదు గా..! సెటైరికల్ కామెంట్స్.. (వీడియో)

Follow us
Latest Articles