Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నిద్రపోతున్న శునకాన్ని ఓ ఆటాడేసుకున్న పిల్లి.. నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Pets Viral Videos: జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా శునకంతో పిల్లి దాగుడు మూతలు ఆడుకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: నిద్రపోతున్న శునకాన్ని ఓ ఆటాడేసుకున్న పిల్లి.. నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..
Dog Cat Viral Video
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 27, 2021 | 3:39 PM

Animal Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా శునకంతో పిల్లి దాగుడు మూతలు ఆడుకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో వివరాలకు వెళ్తే.. ఇంటిలోని సోఫాపై పెంపుడు శునకం నిద్రిస్తోంది. అక్కడకు వచ్చిన పిల్లి.. శునకంతో ఓ ఆటాడుకోవాలని డిసైడ్ అవుతుంది. నిద్రిస్తున్న శునకాన్ని డిస్టర్బ్ చేసి.. సోఫా కింద దాక్కుంటుంది. ఇలా పదేపదే చేస్తూ ఆ శునకాన్ని ఆటపట్టిస్తుంది. పిల్లి అల్లరి చేష్టలు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్నాయి. వీడియోను నెటిజన్స్ రెండుమూడు సార్లు చూసి పిల్లి చేష్టలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ఇప్పటి వరకు 21వేలకు పైగా వ్యూస్ సాధించగా.. 1800కి పైగా లైక్స్ వచ్చాయి.

జంతు ప్రియులను ఎంతో ఆకట్టుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చాలా ఫన్నీగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శునకాన్ని పిల్లి ఆటపట్టిస్తున్న తీరు బ్రిల్లియంట్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. శునకం, పిల్లి మధ్య వైరం గురించి అందరికీ తెలిసిందే కానీ.. ఇలా పిల్లి శునకాన్ని ఓ ఆటాడేసుకోవడం కాస్త వింతగా అనిపిస్తోంది.

శునకంతో దాగుడు మూతలు ఆడుతున్న పిల్లి.. వీడియో

Also Read..

Jio Fuel Station: రిలయన్స్‌ ఇండస్ట్రీ మరో సంచలనం.. పెట్రోల్‌ బంక్‌ల వ్యాపారంలోకి అడుగు పెట్టిన జియో..!

Whatsapp New Feature: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. త్వరలో ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో..