Jio Fuel Station: రిలయన్స్ ఇండస్ట్రీ మరో సంచలనం.. పెట్రోల్ బంక్‌ల వ్యాపారంలోకి అడుగు పెట్టిన జియో..!
Jio Fuel Station: రిలయన్స్ సంస్థ ఏది చేసిన అది సంచనలమే అవుతుంది. మొబైల్ నెట్‌వర్క్ రంగంలో సంచనాలకు తెరలేపిన రిలయన్స్..
Jio Fuel Station: రిలయన్స్ సంస్థ ఏది చేసిన అది సంచనలమే అవుతుంది. మొబైల్ నెట్‌వర్క్ రంగంలో సంచనాలకు తెరలేపిన రిలయన్స్.. ఇంటర్నెట్ వినియోగంలో కూడా సంచలనం సృష్టిస్తోంది. అతి తక్కువ ధరకే ఇంటర్నెట్, మొబైల్ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక తాజాగా పెట్రోల్ బంకుల వ్యాపారంలో అడుగు పెడుతోంది. గతంలో రిలయన్స్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఉన్నా.. అంతంత మాత్రంగానే ఉండేది. ఈ సారి విదేశీ కంపెనీతో జతకట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ సంస్థ బీపీ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ రిలయన్స్ బీపీమొబిలిటీ తొలి పెట్రోల్ బంకును ఆవిష్కరించింది. రిలయన్స్ జియో-బీపీ బ్రాండ్ కింద నవీ ముంబైలోని నావ్డేలో దీనిని ప్రారంభించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా జియో-బీపీ మొబిలిటీ స్టేషన్‌లను తీర్చిదిద్దింది.
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, అడిటివైజ్డ్ ఇంధనాలు, రిఫ్రెష్‌మెంట్లు, ఆహారం మొదలైన వివిధ సర్వీసులన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయని ఆర్‌బీఎంఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా మరింత శక్తివంతమైన ఇంధనాన్ని అందిస్తామని తెలిపింది. ఇందులో ఎలాంటి అదనపు ధర విధించకుండా అందిస్తామని తెలిపింది. అంతర్జాతీయ స్థాయి యాక్టివ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఇంధనం.. కీలకమైన ఇంజిన్ భాగాలకు రక్షణ కల్పిస్తుందని, ఇంజిన్లను శుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్‌బీఎంఎల్ వెల్లడించింది.
మొబిలిటీ స్టేషన్‌లలో ఇవి కూడా..
తమ మొబిలిటీ స్టేషన్లలోను, ఇతర ప్రాంతాల్లోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ మార్పిడి స్టేషన్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బీపీకి చెందిన వైల్డ్ బీన్ కెఫే బ్రాండ్ కాఫీతో పాటు మసాలా చాయ్, సమోసా, ఉప్మా, పనీర్ టిక్కా రోల్ వంటి నాణ్యమైన ఆహారం కూడా అందిస్తామని తెలిపింది.
ఇవీ కూడా చదవండి: Biryani Leaf: బిర్యానీ ఆకు సాగుతో లక్షల్లో సంపాదన.. కేవలం 50 మొక్కలతో ఆదాయం ఎంతో తెలిస్తే..