Airtel, Jio, Vi 100లోపు రీఛార్జ్ ప్లాన్‌లు.. కాల్స్, డేటా ప్రయోజనాలు తెలుసుకోండి..
Recharge Plans: భారతదేశంలోని చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు Airtel, Jio, Vi సేవలను ఉపయోగిస్తున్నారు. వారిలో కొంతమంది చిన్న రీఛార్జ్‌లను కోరుకుంటారు.
Recharge Plans: భారతదేశంలోని చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు Airtel, Jio, Vi సేవలను ఉపయోగిస్తున్నారు. వారిలో కొంతమంది చిన్న రీఛార్జ్‌లను కోరుకుంటారు. 100 రూపాయల కంటే తక్కువ ఉన్న రీఛార్జ్ గురించి తెలుసుకుందాం. కానీ ఇవి తక్కువ వ్యాలిడిటీని కలిగి ఉంటాయి.
100 రూపాయల లోపు ఎయిర్‌టెల్ రీఛార్జ్ రూ.100 కంటే తక్కువ ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌లు రూ.19, 48, 49, రూ.79 ప్లాన్‌లు. రూ.19 రీఛార్జ్‌లో రెండు రోజుల పాటు 200 ఎంబీ డేటా వస్తుంది. రూ.48 రీఛార్జ్ ప్లాన్‌లో 3 జీబీ డేటా మాత్రమే 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.49, రూ.79 రీఛార్జ్ ప్లాన్‌లు 100 ఎంబీ డేటా, కాల్స్‌ని అందిస్తాయి. 200 MB డేటా రూ.64 టాక్ టైమ్ వస్తుంది. వాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. అదే సమయంలో రూ.49 రీఛార్జ్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Vodafone Idea (Vi) రీఛార్జ్ ప్లాన్‌లు Vodafone Idea (Vi) రీఛార్జ్ ప్లాన్‌లలో రూ.100 కంటే తక్కువ ధర రూ.16, రూ.19, రూ.39, రూ.48, రూ.49, రూ.79, రూ.98 ఉన్నాయి.16 రూపాయల రీఛార్జ్‌లో ఒక రోజుకి 1 GB డేటా. రూ.19 ప్లాన్‌లో రెండు రోజుల పాటు 200 ఎంబీ డేటా, కాల్‌లు లభిస్తాయి. రూ.39 రీఛార్జ్ ప్లాన్‌లో 100 ఎంబీ డేటా, టాక్ టైమ్, 28 రోజుల వాలిడిటీ ఉంటుంది.
Vi రూ.48 రీఛార్జ్ ప్లాన్‌లో 28 రోజుల పాటు 3 GB డేటా వస్తుంది. ఇది కాకుండా 64 రోజుల పాటు ఉండే రూ.79 ప్లాన్‌లో 400 MB డేటా, టాక్ టైమ్ వస్తుంది. చివరగా 98 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఉంది. 28 రోజుల చెల్లుబాటుతో డబుల్ డేటా వస్తుంది.
జియో రీఛార్జ్ ప్లాన్‌లు రూ.100 కంటే తక్కువ Jio అనేక రీఛార్జ్ ప్లాన్‌లు 100 రూపాయల లోపు ఉన్నాయి. రూ.10, రూ.20, రూ.50, రూ.100 రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. వీటిలో టాక్ టైమ్ వస్తుంది. ఇది రూ.75 రీఛార్జ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాల్‌లు వస్తాయి. అలాగే రోజువారీ 0.1GB డేటా లభిస్తుంది.