Skin Care: సాఫ్ట్ స్కిన్ కోసం కాఫీ స్క్రబ్‌.. ఇంట్లోనే తయారుచేయండిలా..?

Skin Care: మనం ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు చర్మంపై దుమ్ము, ధూళి కణాలు పేరుకుపోతాయి. దీని కారణంగా చర్మం పొడిబారుతుంది. వీటిని వదిలించుకోవాలంటే

Skin Care: సాఫ్ట్ స్కిన్ కోసం కాఫీ స్క్రబ్‌.. ఇంట్లోనే తయారుచేయండిలా..?
Soft Skin
Follow us
uppula Raju

|

Updated on: Oct 27, 2021 | 1:27 PM

Skin Care: మనం ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు చర్మంపై దుమ్ము, ధూళి కణాలు పేరుకుపోతాయి. దీని కారణంగా చర్మం పొడిబారుతుంది. వీటిని వదిలించుకోవాలంటే ఒక్కటే మార్గం స్క్రబ్ చేయడం. మనలో చాలా మంది మార్కెట్‌లో దొరికే మాయిశ్చరైజ్‌ క్రీములు వాడుతారు. కానీ వాటివల్ల ఉపశమనం తాత్కాలికం మాత్రమే. అందుకే ఇంట్లో దొరికే వస్తువులతో మంచి ఫేస్‌ ప్యాక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది.

ఇంట్లో తయారు చేసిన కాఫీ స్క్రబ్ 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ చక్కెర ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. దీనిని శరీరం మొత్తం అప్లై చేయాలనుకుంటే మరింత జోడించాలి. దీనిని ముఖంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి కడిగేస్తే సరిపోతుంది.

కాఫీ ప్రయోజనాలు కాఫీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. కాఫీ చర్మంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. కాఫీ స్క్రబ్‌ని ఉపయోగించడం వల్ల సెల్యులైట్ తగ్గుతుంది. ఇది మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి మీ చర్మాన్ని కాపాడతాయి. ఫైన్ లైన్స్, సన్‌స్పాట్‌లను తగ్గించడంలో కాఫీ సహాయపడుతుంది.

కొబ్బరి నూనె ప్రయోజనాలు ఎక్స్‌ఫోలియేషన్‌తో పాటు మీ చర్మానికి మాయిశ్చరైజేషన్ కూడా అవసరం. ఈ సందర్భంలో కొబ్బరి నూనె మీకు సహాయపడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. కొబ్బరి నూనె కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

చక్కెర ప్రయోజనాలు చిన్న చక్కెర కణాలు మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడతాయి. ఇది చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తుంది. షుగర్ స్క్రబ్స్ చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Viral: సరదాగా 4 గంటలు పబ్‌లో గడిపారు.. మద్యం సేవించారు.. చివరిగా బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి..

Kangana Ranaut: అండమాన్ జైలును సందర్శించిన కంగనా రనౌత్.. వీర్ సావర్కర్‌కు నివాళి