Best Diwali Outfit Ideas: దీపావళి రోజు స్టైలిష్ దుస్తువులతో డిఫరెంట్‌గా కనిపించడానికి ఇలా ప్లాన్ చేసుకోండి..

దీపావళి అంటే వెలుగుల పండుగ. ప్రతి ఇంట కొత్త వెలుగు నింపుతూ.. ఆనందాలను పంచుతుంది. సిరులను నింపుతుంది. ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు.

Best Diwali Outfit Ideas: దీపావళి రోజు స్టైలిష్ దుస్తువులతో డిఫరెంట్‌గా కనిపించడానికి ఇలా ప్లాన్ చేసుకోండి..
Best Diwali Outfit Ideas
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 27, 2021 | 9:29 PM

దీపావళి అంటే వెలుగుల పండుగ. ప్రతి ఇంట కొత్త వెలుగు నింపుతూ.. ఆనందాలను పంచుతుంది. సిరులను నింపుతుంది. ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. దీపావళికి చాలా ప్రత్యేకంగా కనిపించాలాని ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటారు. అందరిలో భిన్నంగా ,స్టైలిష్‌గా కనిపించే విధంగా తమను తాము డిజైన్ చేసుకుంటారు. మీరు కూడా ఈ దీపావళికి మిమ్మల్ని మీరు స్టైలిష్‌గా మార్చుకోవాలనుకుంటే.. చింతించకండి. ఏ స్టైల్ డ్రెస్‌లు మీ లుక్‌కి చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయో మేము మీకు చెప్తాము. ఈరోజు మనం ఈ దీపావళికి చాలా ట్రెండీగా.. సంప్రదాయ దుస్తులను ప్లాన్ చేసుకుందాం.

లెహంగా, పట్టు పరికిణి..

మీరు ఈ దీపావళికి సాంప్రదాయ దుస్తులు ధరించాలనుకుంటే ముందుగా లెహంగా/పట్టు పరికిణిను ఎంచుకోవచ్చు. లెహంగా ట్రెడిషనల్ లుక్‌తో పాటు స్టైలిష్ లుక్‌ను కూడా ఉంటుంది. సాధారణంగా మనం లెహంగా ధరిస్తాం కానీ దీపావళి రోజున లెహంగాతోపాటు మిర్రర్ వర్క్ బ్లౌజ్ ధరిస్తే అదిరిపోతుంది. మీరు సాదా లెహంగాపై రంగురంగుల బ్లోఅవుట్‌తో సాదా దుపట్టాను డిజైన్ చేసుకోవచ్చు. దీనితో పాటు V నెక్, కోల్డ్ షోల్డర్ లేదా ఆఫ్ షోల్డర్ డిజైన్‌తో కూడిన బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది. ఇక మన తెలుగువారికి దసరా, దీపావళి, సంక్రాంతి రోజుల్లో పట్టు పరికిణితో మురిపిస్తారు ఆడపడుచులు.

అనార్కలి సూట్‌తో స్టైలిష్ లుక్‌..

ఈ రోజుల్లో అనార్కలీ సూట్ ట్రెండ్‌ నడుస్తోంది. సాధారణంగా మహిళలు దీపావళి రోజూ కూడా అనార్కలీ సూట్‌లు ధరిస్తారు. ఎత్నిక్ వేర్‌లో అనార్కలి సూట్‌లు ట్రెండీగా కనిపిస్తున్నందున.. అవి సమానంగా సౌకర్యవంతంగా ఉంటాయి. దీపావళికి ఇది ప్రత్యేకమైన దుస్తులే కావచ్చు. మీరు అనార్కలీ కుర్తాపై ప్యాంటు, పలాజో లేదా సరారాను సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు పొట్టి అనార్కలీ కుర్తాతో ప్యాంట్‌లను జత చేయవచ్చు. ఇది చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

చీరతో..

సందెపొద్దు అందాలున్న.. దీపావళి దీపాల వెలుగుల్లో పట్టు చీరను మీరు కట్టుకుంటే.. ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ అని ఎవరైనా ఆనందంగా పాడాల్సిందే. ఇక చీరలపై పరుచుకున్న వర్ణాలు.. ‘సొగసు చూడతరమా’అనిపించక మానవు. భారతీయ మహిళల మొదటి ఎంపిక చీర. ఎందుకంటే చీరల్లో చాలా వెరైటీలు ఉన్నా వాటిని కట్టుకుంటే వచ్చే అందం మరోలా ఉంటుంది.  చీరతోపాటు మీరు ఎంత స్టైలిష్ బ్లౌజ్ ఎంచుకుంటే అంత లుక్ మీ సొంతం అవుతుంది. మీరు నూడుల్స్ స్టెప్ బ్లౌజ్ లేదా ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ధరించవచ్చు.

ఇది కాకుండా, మీరు పొడవాటి స్కర్ట్‌తో పొట్టి స్టైలిష్ టాప్‌ని క్యారీ చేయవచ్చు. లేదా వర్క్ ప్యాంట్‌పై చిన్న టాప్‌తో కూడిన దుపట్టా ధరించడం ద్వారా మీరు మీ అందానికి మెరుపులు దిద్దుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి: LPG Gas Prices: దీపావళి ముందే గ్యాస్ బండకు రెక్కలు.. రూ.100 వరకు పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు..

Covid Lockdown: థర్డ్ వేవ్ భయాలు.. దేశంలోని ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్..