Guggul Uses: కీళ్లనొప్పులు, మెడ నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారా.. అయితే గుగ్గులు ఉపయోగించి చూడండి ..

Guggul Uses: ప్రకృతిలో అనేక మొక్కలు.. వాటిల్లో ఔషధ గుణాలున్నాయి. వాటిల్లో ఒకటి గుగ్గులు. ఈ మొక్కనుంచి లభించే జిగురు వంటి ద్రవాన్ని గుగ్గులుగా..

Guggul Uses: కీళ్లనొప్పులు, మెడ నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారా.. అయితే గుగ్గులు ఉపయోగించి చూడండి ..
Guggul
Follow us

|

Updated on: Oct 28, 2021 | 8:29 AM

Guggul Uses: ప్రకృతిలో అనేక మొక్కలు.. వాటిల్లో ఔషధ గుణాలున్నాయి. వాటిల్లో ఒకటి గుగ్గులు. ఈ మొక్కనుంచి లభించే జిగురు వంటి ద్రవాన్ని గుగ్గులుగా ఉపయోగిస్తారు.  గుగ్గులు వ్యాపార పంట. మంచి వాసనగల ఈ బంకను ఎండిన తరువాత ధూపము గాను, అగరుబత్తీలు తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ మొక్కలు ద్విరూప మొక్కలు.. వీటి వేర్లు మగ, ఆడ వేర్లుగా ఉంటాయి. ఈ గుగ్గులు నాలుగు రకాలు… 1 రత్నపురి గుగ్గులు , 2 తెల్ల గుగ్గులు , 3 పుట్ట గుగ్గులు , 4 మహిసాక్షి గుగ్గులు. సుమారు 3, 000 సంవత్సరాల నుండి ఆయుర్వేద మందుల్లో గుగ్గులు ఉపయోగిస్తున్నారు. ఈరోజు గుగ్గులు వైద్య  ఉపయోగాలు తెలుసుకుందాం..

గుగ్గులులో స్టెరోన్‌.. గుగులిపిడ్  అనే రసాయన పదార్ధం ఉంది. దీనికి శరీరంలోని కొలస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉందని శాస్త్రీయంగా రుజువైంది.  డేవిడ్ మూరె .. బేలర్ మెడికల్ కాలేజీలో పరిశోధనల్లో వెల్లడైంది.

మెడ నొప్పి తీవ్రంగా ఉన్నవారు.. తిప్పతీగను, త్రిఫలాలను సమానంగా తీసుకుని కచ్చా పచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం తయారుచేసుకోవాలి. అర కప్పు కషాయానికి అర టీ స్పూన్ శుద్ధ గుగ్గులు కలిపి నెల రోజులపాటు తీసుకుంటే దీర్ఘకాలం నుంచి ఉన్న మెడ నొప్పి తగ్గుతుంది.

కీళ్ల నొప్పులకు వైద్యచికిత్సల్లో ఆయుర్వేద నిపుణులు యోగరాజ గుగ్గులును ఉపయోగిస్తారు. ఇక యోగారాజా గుగ్గులు    పక్షవాతానికి ముందుగా ఆయుర్వేద నిపుణులు ఇస్తారు.

కాంచనార గుగ్గులు మెడిసిన్స్ ను చర్మవ్యాధులు, అంటు వ్యాధులకు, గడ్డల నివారణకు ఉపయోగిస్తారు.

కీళ్ళ నొప్పులకు బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము, ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు చీల మండల నొప్పులు, మెడిమల నొప్పులు తగ్గుతాయి.

మధుమేహ వ్యాధి నివారణకు గుగ్గులు, అశ్వగంధం కలిపి ఉపయోగిస్తే మంచిది.

మహిసాక్షి గుగ్గిలము: ఇది మృదువుగ, జిగటగ, సువాసనగ, చేదుగా ఉంటుంది. ఈ గుగ్గులం రక్తం శుభ్రపరుస్తుంది. పొట్టకు బలం చేకూరుస్తుంది. శరీరానికి కాంతినిస్తుంది.  కఫము,  మూలవ్యాధి,  పాత నొప్పులు, విషాన్ని హరిస్తుంది. ఎర్రగుగ్గిలము:  గొంతుక వాపుతో ఇబ్బంది పడుతున్నవారు తేనెలో ఎర్రగుగ్గులు కలిపి పట్టువేసిన ఉపశమనం ఇస్తుంది.  ఆవుపాలలో గుగ్గిలము కలుపుకుని తాగినా లైంగిక సమస్య నిర్వహిస్తుంది. శరీరంలోని ఇతర రుగ్మతలకు దీని చూర్ణము వేడినీళ్ళలో కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీని సత్తువ 20 సంవత్సరములవరకు శరీరంలో ఉంటుందని ఆయుర్వేదం తెలిపింది.

Also Read:   రేపటి నుంచి రెండు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం