AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీరు మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతున్నారా.? అయితే కచ్చితంగా ఈ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సిందే..

Health: మనలో చాలా మంది మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడుతుంటారు. ఇది సాధారణ తలనొప్పిగా మొదలై తలకు ఒకవైపు విపరీతమైన నొప్పిగా మారుతుంటుంది...

Health: మీరు మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతున్నారా.? అయితే కచ్చితంగా ఈ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సిందే..
Migraine Problem
Narender Vaitla
| Edited By: |

Updated on: Oct 28, 2021 | 6:26 AM

Share

Health: మనలో చాలా మంది మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడుతుంటారు. ఇది సాధారణ తలనొప్పిగా మొదలై తలకు ఒకవైపు విపరీతమైన నొప్పిగా మారుతుంటుంది. మైగ్రేన్‌ వచ్చిన వారు ఆ తలనొప్పిని భరించలేరు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. వాతావరణం చల్లగా మారితే చాలు వెంటనే తలపోటు మొదలువుతంది. అయితే మైగ్రేన్‌తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆ నొప్పి మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ మైగ్రేన్‌తో బాధపడే వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..

* ప్రస్తుతం వంటకాల్లో టేస్టింగ్ సాల్ట్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ టెస్టింగ్‌ సాల్ట్‌లో మోనోసోడియం గ్లూట‌మేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మైగ్రేన్‌ నొప్పి పెరగడానికి కారణంగా మారుతుంది. ఈ టేస్టింగ్‌ సాల్ట్‌ను ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్‌లో వాడుతుంటారు. కాబట్టి మైగ్రేన్‌తో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లో దీనికి దూరంగా ఉండాలి.

* మైగ్రేన్‌తో బాధపడేవారు షుగర్‌ ఫ్రీ పేరిట లభించే పిల్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి కూడా మైగ్రేన్‌ నొప్పి పెరగడానికి కారణంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.

* చాక్లెట్లు తింటే కూడా మైగ్రేన్‌ సమస్య పెరుగుందని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్‌ ఉన్నవారు చాక్లెట్‌ తింటే మైగ్రేన్‌ తలనొప్పి ఎక్కువయ్యే అవకాశాలు 22 శాతం పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.

* మైగ్రేన్‌ సమస్య ఉన్న వారు నిల్వ చేసిన మాంసం తింటే నొప్పి పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మాంసహారాన్ని నిల్వ చేసి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.

* కెఫీన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. సాధారణంగా టీ తాగితే తలనొప్పి తగ్గుతుందని అనుకుంటాం.. కానీ మైగ్రేన్‌తో బాధపడేవారికి మాత్రం నొప్పి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.

* చీజ్‌ తిన్నా మైగ్రేన్‌ నొప్పి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చీజ్‌ తింటే మైగ్రేన్‌ నొప్పి పెరిగే అవకాశం 35 శాతం వరకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

Also Read: Telangana: కొడుకు కాదు క్రూరుడు.. బ్రతికుండగానే తల్లికి ఖర్మకాండలు.. కన్నీటి పర్యంతమైన మాతృమూర్తి

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ కీలక నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా..! ఎందుకో తెలుసా?

Telangana: పోడు రైతులకు గుడ్ న్యూస్.. భూముల సమస్యకు చెక్.. సీఎం ఆదేశాలు

Follow Us
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే