Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొడుకు కాదు క్రూరుడు.. బ్రతికుండగానే తల్లికి ఖర్మకాండలు.. కన్నీటి పర్యంతమైన మాతృమూర్తి

నల్గొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అమ్మకు ఘోరమైన అవమానం జరిగింది. బ్రతికుండాగానే కన్న తల్లి ఖర్మ లేఖ రాయించి, ఖర్మకాండలు...

Telangana: కొడుకు కాదు క్రూరుడు.. బ్రతికుండగానే తల్లికి ఖర్మకాండలు.. కన్నీటి పర్యంతమైన మాతృమూర్తి
Cruel Son
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 27, 2021 | 8:46 PM

“అమ్మ”…ఈ లోకంలో అనిర్వచనీయమైన అంతులేని ప్రేమకు తార్కాణం. కానీ అమ్మను ఘోరంగా అవమానించాడు ఓ కొడుకు. బ్రతికుండాగానే కన్న తల్లి ఖర్మ లేఖ రాయించి, ఖర్మకాండలు నిర్వహించడానికి పూనుకున్నాడు ఓ పుత్రరత్నం. అమ్మకు సంతాపసభ ఏర్పాటు చేసి తన కర్కశత్వాన్ని, కఠినత్వాన్ని నిరూపించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..  నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములకు చెందిన వారణాశి పోచమ్మకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు. ఉన్నంతలో అందరినీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. ఎవరి జీవితాలు వారికి అయ్యాక కూడా పోచమ్మ వృద్ధాప్యంలో రోజు వారీ కూలీ పనులకు వెళుతూ పొట్టపోసుకొని జీవిస్తుంది. తన సంపాదన డబ్బులను కూతుళ్లు, చిన్న కొడుకుకు పెడుతుందని పెద్ద కొడుకు యాదగిరి తల్లిపై కక్ష పెంచుకున్నాడు. తన తల్లి చనిపోయిందని బ్రతికుండగానే పెద్ద ఖర్మ కార్డులను ప్రింట్ చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.

తాను బ్రతికుండగానే చంపేసి, ఖర్మకాండలు చేస్తున్నాడని ఆ తల్లి మనసు ముక్కలై కన్నీటి పర్యంతమైంది. ఇంతటి దుష్టకార్యానికి ఒడిగట్టి…అమ్మ అనే మమకారాన్ని చంపేశాడు కొడుకు యాదగిరి. బిడ్డ చేసే పని చూసి తల్లడిల్లిన ఆ వృద్ధ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కొడుకు చేసిన పనికి గుండె బద్దలై న్యాయం కోసం నకిరేకల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. పోచమ్మ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు… కొడుకు యాదగిరికి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు.

Also Read: “చావనైనా చస్తామ్ కానీ, ఈ వాహనాన్ని పోనివ్వం”.. ఇంతకీ అందులో ఏమున్నాయ్

48 వేల మందికి ఉద్యోగాలు… ఆ రంగంలో కీలక ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌