Guntur District: “చావనైనా చస్తామ్ కానీ, ఈ వాహనాన్ని పోనివ్వం”.. ఇంతకీ అందులో ఏమున్నాయ్

గుంటూరు జిల్లా తెనాలిలో ఈ రోజు హైటెన్షన్ క్రియేట్ అయ్యింది. పొద్దుపొద్దున్నే కొందరు కుటంబాలతో సహా ఆందోళనకు దిగారు.

Guntur District: చావనైనా చస్తామ్ కానీ, ఈ వాహనాన్ని పోనివ్వం.. ఇంతకీ అందులో ఏమున్నాయ్
Pig Breeders Protest
Follow us

|

Updated on: Oct 27, 2021 | 3:20 PM

గుంటూరు జిల్లా తెనాలిలో ఈ రోజు హైటెన్షన్ క్రియేట్ అయ్యింది. పొద్దుపొద్దున్నే కొందరు కుటంబాలతో సహా ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధర్నాకి దిగి వాహనాలను ఆపేశారు. చిన్నాపెద్దా మహిళలు అందరూ కలిసి రోడ్డుపై బైఠాయించారు. కొంతమంది యువకులు ఏకంగా వెహికల్  పడుకున్నారు. ఓ కుర్రాడైతే ఎగ్జాట్‌గా టైర్‌ దగ్గరే అడ్డంగా పడుకున్నాడు. చావనైనా చస్తామ్ కానీ, ఈ వెహికల్‌ని మాత్రం కదలనివ్వం అంటున్నారు. ఇంతకీ వాళ్ల డిమాండ్ ఏంటి? ఎందుకు? ఎవరి కోసం ఆందోళన చేస్తున్నారనేగా మీ డౌట్ అక్కడికే వస్తున్నాం.  వీళ్లంతా ఆందోళన చేస్తున్నది వాళ్ల కోసం కాదు. మరి ఎవరి కోసం అనుకుంటున్నారా..?. పందుల కోసం. అవును, వీళ్లంతా పందుల కోసమే ధర్నాకి దిగారు. పందుల కోసం ఎందుకు ఆందోళన చేపట్టారు? పందులకు వీళ్లకు అసలు లింకేంటి? అని మళ్లీ మీకు డౌట్స్ రావొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలో పందులు అక్రమంగా తిరుగుతున్నాయట. వాటి వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. దీంతో అలా తిరుగుతోన్న పందుల్ని పట్టుకుని తరలించాలని మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ పాస్ చేశారు. అంతే, పొద్దుపొద్దున్నే రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది పందుల్ని పట్టుకుని తరలిస్తుండగా వాటి పెంపకందారులు అడ్డుపడ్డారు. పందుల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలు అధికారుల నిర్వాకంతో రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

పందుల్ని తీసుకెళ్లే ఊరుకునేది లేదంటూ వెహికల్‌కి అడ్డంగా పడుకున్నారు. పోలీసులు నచ్చజెప్పినా తగ్గేదెలే అంటూ పిల్లలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో భారీగా పోలీసులకు మొహరించి.. అధికారులకు అక్కడి నుంచి  పందులను తరలించారు.

Also Read: ఏపీలో రేషన్ డీలర్ల సమ్మె ఎందుకు..? వారి డిమాండ్లు ఏంటి.. ప్రభుత్వం ఏమంటుంది?