AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 48 వేల మందికి ఉద్యోగాలు… ఆ రంగంలో కీలక ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.  రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై ఈ మీటింగ్‌లో చర్చించారు. 

Andhra Pradesh: 48 వేల మందికి ఉద్యోగాలు... ఆ రంగంలో కీలక ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Ap Government
Ram Naramaneni
|

Updated on: Oct 27, 2021 | 5:38 PM

Share

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.  రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై ఈ మీటింగ్‌లో చర్చించారు.  ఏపీలో పర్యాటకరంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసంగా రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు.  వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీట వల్ల దాదాపు దాదాపు 48 వేల మందికి ఉద్యోగాల కల్పన ఉంటుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 1564 గదులు అందుబాటులోకి రానున్నాయి.  ఐదేళ్లలో వీటిని పూర్తి చేస్తామని కంపెనీలు బోర్డుకు తెలిపాయి.

విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో విఖ్యాత కంపెనీ ఓబెరాయ్‌ ఆధ్వర్యంలో రిసార్టులు అందుబాటులోకి రానున్నాయి. ఓబెరాయ్‌ విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టుల నిర్మాణం జరగనుంది.  విశాఖపట్నం శిల్పారామంలో హయత్‌ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం జరగనుంది. తాజ్‌ వరుణ్‌ బీచ్‌ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్‌మెంట్‌ అందుబాటులోకి రానున్నాయి.  విశాఖపట్నంలో టన్నెల్‌ ఆక్వేరియం,  స్కైటవర్‌ నిర్మాణం ప్రతిపాదనలకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హెటల్‌ అందుబాటులోకి రానుంది.  అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రం నిర్మాణానికి స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ఆమోద్రముద్ర వేసింది.

పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని అధికారులకు సీఎం సూచించారు. టూరిజం అంటే ఏపీ వైపే చూసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు రూపొందించాలని చెప్పారు. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలన్నారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆధునిక వసతలు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్రం స్ధాయి పెరుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు, విశాఖపట్నంలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశానికి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ కె ప్రవీణ్‌ కుమార్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్‌కుమార్, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read: “చావనైనా చస్తామ్ కానీ, ఈ వాహనాన్ని పోనివ్వం”.. ఇంతకీ అందులో ఏమున్నాయ్

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్.. ఏం మాట్లాడారంటే