Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Prices: దీపావళికి ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధర

రోజురోజుకీ పెరిగిపోతున్న గ్యాస్ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా మండిపోతున్నాయి.

LPG Gas Prices: దీపావళికి ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధర
Cooking Gas Lpg
Follow us
Sanjay Kasula

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 27, 2021 | 5:51 PM

ఏం కొనేటట్టు లేదు-ఏం తినేటట్టు లేదు. ప్రజలందరూ లేవడంతోనే ఈ పాటే పాడుకుంటున్నారు. గతంలో ఈ పాట ఎప్పుడో గానీ గుర్తొచ్చేది కాదు. కానీ, ఇప్పుడు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనసులో ఆటోమేటిక్‌గా ప్లే అయిపోతున్న ఈ సాంగ్ గుండెల్లో రీసౌండ్ వచ్చేలా చేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న గ్యాస్ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా మండిపోతున్నాయి. పేదల వంటింటి బడ్జెట్ అమాంతం పెరిగిపోవడంతో ఏదీ వండుకోలేని పరిస్థితి ఏర్పడింది.

దసరాకు ముందే వంట గదిలో మంట పెట్టేశారు. గ్యాస్ సిలిండర్ ధరలను బాదేశారు. 14 కేజీల గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా 15 రూపాయలు పెంచడంతో ఎల్జీజీ ధర వెయ్యి రూపాయలు దాటేసింది. ఒక్క ఏడాదిలోనే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 205 రూపాయలు పెరిగింది. అయితే ఈ సారి దీపావళికి మరోసారి పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. అది కూడా అంతా.. ఇంతా కాదు రూ. 100 వరకు పెరగొచ్చని భయపెడుతున్నాయి.

LPG రేట్లు చివరిసారిగా అక్టోబర్ 6న సిలిండర్‌కు రూ.15 చొప్పున పెంచాయి. జూలై నుండి మొత్తం 14.2 కిలోల సిలిండర్‌పై రూ.90కి పెరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు రిటైల్ అమ్మకపు ధరను ఖర్చుతో సరిపెట్టలేకపోతున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడానికి ఇప్పటివరకు ప్రభుత్వ సబ్సిడీ ఆమోదించబడలేదు.

అంతర్జాతీయ ఇంధన ధరలు బహుళ-సంవత్సరాల గరిష్ఠ స్థాయికి ఎగబాకడంతో ఎల్‌పిజి అమ్మకాలపై అండర్ రికవరీ లేదా నష్టాలు సిలిండర్‌కు రూ. 100కు పైగా పెరిగాయని వారు అంటున్నారు. ఈ నెలలో సౌదీ ఎల్‌పీజీ ధరలు 60 శాతం పెరిగి టన్నుకు 800 డాలర్లకు చేరుకోగా.. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 85.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ప్రతి నెలా వంట గ్యాస్ ధరల్ని పెంచుతూ పోతున్న కంపెనీలు.. రాయితీకి కూడా దాదాపు మంగళం పాడేసిందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సిలిండర్‌పై మూడొందల వరకు రాయితీ ఇవ్వగా.. ఇప్పుడు నామమాత్రంగా ఇస్తూ సరిపెడుతోంది. దాంతో, ఇంట్లో గ్యాస్‌ ముట్టించాలంటేనే మహిళలకు ముచ్చెమటలు పడుతున్నాయి.

తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధర దాదాపు వెయ్యి రూపాయలకు చేరింది. రవాణా అండ్ సర్వీస్ ఛార్జ్ కలుపుకుంటే వెయ్యి రూపాయలు దాటిపోతోంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో గ్యాస్ ధరలు ఎలాగున్నాయో ఒకసారి చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎల్పీజీ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రవాణా అండ్ సర్వీస్ ఛార్జెస్ కలుపుకుంటే ఎల్పీజీ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటిపోతోంది. ఏపీలో అత్యధిక ధర కర్నూలులో ఉంది. ఇక్కడ కంపెనీ ప్రైసే 991 రూపాయలు. ఎక్స్‌ట్రా ఛార్జెస్ కలుపుకుంటే మినిమం 1050 చెల్లించాల్సిందే.

కేవలం ఏడాది కాలంలోనే వంట గ్యాస్ ధరలు డబుల్ అయ్యాయి. 2020 సెప్టెంబర్‌లో 14 కేజీల ఎల్పీజీ ధర 662 రూపాయలు ఉంటే… ఇప్పుడు వెయ్యి రూపాయలకు చేరింది. 2020 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు గ్యాస్ ధరలు ఎలా పెరిగాయో ఒకసారి చూద్దాం.

సెప్టెంబరు 28వ తేదీ నుంచి మూడు వారాల వ్యవధిలో రేట్ల సవరణ ముగిసిన తర్వాత పెట్రోలు ధర 22 సార్లు పెరిగింది. మొత్తం మీద లీటరు ధర రూ.6.75 పెరిగింది. సెప్టెంబరు 24 నుంచి ఇప్పటి వరకు 24 పెంపుదలతో డీజిల్ ధరలు లీటరుకు రూ.8.05 పెంచారు. అంతకు ముందు మే 4 నుంచి జూలై 17 మధ్య పెట్రోల్ ధర లీటర్‌కు రూ.11.44 పెరిగింది. ఈ సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.9.14 పెరిగింది.

హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర సుమారు వెయ్యి రూపాయలకు చేరింది. ఒక్క గ్యాస్ సిలిండర్‌కే వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే.. సామాన్యుడు ఎలా బతుకుతాడు. ఓ కామన్‌ మేన్ మాటల్లోనే విందాం.

ఇవి కూడా చదవండి: Ban Diwali Crackers: ఈ ఏడాది కూడా నిశ్శబ్ధ దీపావళినే.. అక్కడ ఇవాళ్టి నుంచి క్రాకర్స్ అమ్మడం, కాల్చడం నిషేధం..

Covid Lockdown: థర్డ్ వేవ్ భయాలు.. దేశంలోని ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్..

Indian Oil LPG: మార్కెట్‌లోకి కొత్త ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్.. వినియోగం తక్కువ.. సమయం ఆదా.. మరెన్నో ప్రత్యేకతలు..