Viral: సరదాగా 4 గంటలు పబ్‌లో గడిపారు.. మద్యం సేవించారు.. చివరిగా బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!

ఆ నలుగురు ఫ్రెండ్స్ చాలాకాలం తర్వాత కలుసుకున్నారు. ఒక పబ్‌లో గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. అన్నీ అనుకున్నట్లే..

Viral: సరదాగా 4 గంటలు పబ్‌లో గడిపారు.. మద్యం సేవించారు.. చివరిగా బిల్లు చూసి  నోరెళ్లబెట్టారు!
Bill
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 27, 2021 | 1:26 PM

ఆ నలుగురు ఫ్రెండ్స్ చాలాకాలం తర్వాత కలుసుకున్నారు. ఒక పబ్‌లో గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. అన్నీ అనుకున్నట్లే టేబుల్ బుక్ చేసుకున్నారు. అయితే వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వీళ్లు పబ్‌లో నాలుగు గంటలు గడిపిన తర్వాత వచ్చిన బిల్ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ఐర్లాండ్‌లో చోటు చేసుకోగా.. అసలు ఆ కథేంటి.? వివరాలు ఏంటో తెలుసుకోండి.!

ఐర్లాండ్‌కు చెందిన నలుగురు ఫ్రెండ్స్.. గెట్ టుగెదర్ ట్రిప్‌అడ్వైజర్‌ అనే పబ్‌లో టేబుల్ రిజర్వ్ చేసుకున్నారు. పలు ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారు. నాలుగు గంటల పాటు సరదాగా గడిపారు. ఇక వెళ్ళిపోదామని అనుకున్న వాళ్లు వెయిటర్‌ను బిల్లు తీసుకురమ్మని కోరగా.. వచ్చిన ఆ బిల్‌ను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బిల్ సుమారు రూ. 50 వేలు కావడంతో ఆ స్నేహితులు నోరెళ్లబెట్టారు. ఈ చేదు అనుభవాన్ని వాళ్లు ఫేస్‌బుక్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు.

1

 

”ట్రిప్‌అడ్వైజర్‌ పబ్‌కి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ ప్లాన్‌ను మార్చుకోండి. అక్కడ సర్వీస్‌ అధ్వాన్నంగా ఉంటుంది. అంతేకాకుండా సిబ్బంది తప్పుడు బిల్లులు వేస్తున్నారు. మనం ఆర్డర్ చేయని ఐటెమ్స్‌ను కూడా బిల్‌లో చేరుస్తున్నారు” అని పోస్ట్ చేశారు. వాస్తవానికి మేము పబ్‌కి వెళ్లిన రోజు.. ముందుగానే టేబుల్ బుక్ చేసుకున్నాం. అయితే ఆ పబ్ నిర్వాహకులు మాకు తెలియకుండానే బుకింగ్ రద్దు చేశారు. వారితో సుదీర్ఘ సంభాషణ తర్వాత టేబుల్ ఇచ్చారు.

మేము ఆర్డర్ ఇచ్చిన మొదటి ఐటెమ్‌ను కూడా గంట సమయం అనంతరం తీసుకొచ్చారు. అలాగే అక్కడి సిబ్బంది సర్వ్ చేయడంలో చాలా సమయాన్ని వృథా చేశారు. తమ తర్వాత వచ్చిన వారికి ముందు సర్వీసు చేస్తూ.. తమను వెయిట్ చేయించారు. దీని తర్వాత, బిల్ అడగగా.. దాన్ని చూసి ఖంగుతిన్నాం. నాలుగు గంటలు గడిపి.. సాధారణ ఐటెమ్స్ ఆర్డర్ ఇచ్చినందుకు రూ. 50 వేల బిల్లు అందజేశారు. మేము ఆర్డర్ చేయని ఐటెమ్స్ కూడా బిల్‌లో జోడించారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral Video: డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

IPL 2022: వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..

Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..