Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రియుడి కోసం కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫైటింగ్‌ వీడియో..

Viral Video: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బరాబిర్వా కూడలికి సమీపంలో ఉన్న స్కై హిల్టన్ హోటల్ బార్ వెలుపల ఇద్దరు యువతులు గొడవ పడ్డారు. ఈ విషయం పోలీసు

Viral Video: ప్రియుడి కోసం కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫైటింగ్‌ వీడియో..
Uttar Pradesh
Follow us
uppula Raju

|

Updated on: Oct 27, 2021 | 1:25 PM

Viral Video: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బరాబిర్వా కూడలికి సమీపంలో ఉన్న స్కై హిల్టన్ హోటల్ బార్ బయట ఇద్దరు యువతులు గొడవ పడ్డారు. ఈ విషయం పోలీసు స్టేషన్‌కి చేరింది. ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం.. యువకుడి మాజీ, ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్స్‌ బార్ వెలుపల గొడవ పడ్డారు. ఇందులో మాజీ ప్రియురాలి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రస్తుత ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతేకాదు యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ యువతుల గొడవకు సంబంధించి ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెలిసిన సమాచారం మేరకు.. సోమవారం రాత్రి కారులో ఒక యువతి స్కై హిల్టన్ హోటల్ బార్ బయట వద్దకు వచ్చి ఆగింది. ఈలోగా అక్కడికి ఫైజాబాద్ రోడ్డులో నివాసం ఉంటున్న రాబిన్ అనే వ్యక్తి వచ్చాడు. అతడితో పాటు మరో ఇద్దరు యువతులు కూడా వచ్చారు. తర్వాత వారిద్దరు కారులో ఉన్న యువతితో గొడవ పడ్డారు.

అయితే రాబిన్‌కి కారులో ఉన్న యువతికి గతంలో స్నేహం ఉందని తర్వాత ఇద్దరూ విడిపోయారని తెలిసింది. అదే సమయంలో గత కొన్ని రోజులుగా రాబిన్ మరో యువతితో డేటింగ్‌లో ఉన్నాడు. దీంతో రాబిన్‌తో వచ్చిన ఇద్దరు యువతులు కారులో ఉన్న రాబిన్ మాజీ ప్రియురాలిని తీవ్రంగా కొట్టారు. దీంతోఆమె పరిస్థితి విషమించింది. అక్కడ ఉన్న కొంతమంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన యువతి ఫిర్యాదు మేరకు.. రాబిన్‌తో పాటు అతనితో వచ్చిన ఇద్దరు యువతులపై కేసు నమోదు  చేశారు.  అయితే ఇంతకుముందే అంటే అక్టోబరు 10న గాయపడిన యువతి రాబిన్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదే విషయమై వారు ఈ యువతితో గొడవపడినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణ చేపట్టారు. అసలు విషయాలు ఇంకా తేలాల్సి ఉంది.

Hrithik Roshan: ‘క్రిష్ 4’లో పాట పాడుతున్న హృతిక్‌ రోషన్‌.. ఫ్యాన్స్‌కి ఇక పండుగే..!

తండ్రి శవం ముందు యువతి ఫొటోషూట్‌.. సోషల్‌మీడియాలో ఏకిపారేస్తున్న జనాలు

Pearl Farming: బకెట్లలో ముత్యాల సాగుబడి.. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి.. ఎలానో తెలుసుకుందాం రండి!