Hrithik Roshan: ‘క్రిష్ 4’లో పాట పాడుతున్న హృతిక్‌ రోషన్‌.. ఫ్యాన్స్‌కి ఇక పండుగే..!

Hrithik Roshan: బాలీవుడ్ యాక్షన్‌ హీరో హృతిక్ రోషన్‌కి ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికి తెలుసు. విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారు. అందుకే హృతిక్‌ ప్రపంచ వ్యాప్తంగా

Hrithik Roshan: 'క్రిష్ 4'లో పాట పాడుతున్న హృతిక్‌ రోషన్‌.. ఫ్యాన్స్‌కి ఇక పండుగే..!
Hrithik
Follow us
uppula Raju

|

Updated on: Oct 27, 2021 | 12:01 PM

Hrithik Roshan: బాలీవుడ్ యాక్షన్‌ హీరో హృతిక్ రోషన్‌కి ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికి తెలుసు. విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారు. అందుకే హృతిక్‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ కోసం సిద్ధమవుతున్నారు. అభిమానులు కూడా ఈ సిరీస్‌లో వచ్చే సినిమాలన్నింటిని తెగ ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమా కోసం వారు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హృతిక్‌రోషన్ పాట పాడుతున్నారని పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ రోషన్‌ తెలిపారు.

లాక్డౌన్ సమయంలో పియానో​నైపుణ్యాలను ప్రదర్శించిన హృతిక్ రోషన్ ‘జిందగీ మిలేగీ నా దొబారా’లోని సెనోరిటా, ‘కైట్స్’లోని ది కైట్స్ ఇన్ స్కై వంటి పాటలకు తన గాత్రాన్ని అందించారు. క్రిష్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. అనంతరం ఇలా రాశారు. ‘ఇది గతం ఇప్పుడు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూద్దాం. అలాగే ప్రస్తుతం క్రిష్ 4కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని’ చెప్పారు. హృతిక్ రోషన్ ‘క్రిష్’ 2006లో విడుదలైంది. అంతకుముందు 2003లో సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కోయి మిల్ గయా’ విడుదలైంది. ఈ సినిమా కథను ముందుకు తీసుకెళ్లి ‘క్రిష్’లో చూపించారు. అలా బాలీవుడ్ తన మొదటి సూపర్ హీరోని పొందింది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో కనిపించారు.

తండ్రి శవం ముందు యువతి ఫొటోషూట్‌.. సోషల్‌మీడియాలో ఏకిపారేస్తున్న జనాలు

Viral Photos: కాఫీతో అద్భుతమైన పెయింటింగ్‌.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు..

మద్యం తాగేటప్పుడు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు… తింటే ఇక అంతే సంగతులు.. అవెంటంటే..