uppula Raju |
Updated on: Oct 27, 2021 | 11:13 AM
మీరు చాలా మంది చిత్రకారుల పెయింటింగ్స్ చూసి ఉంటారు. అవి ప్రత్యేకంగా, అందంగా ఉండవచ్చు. కానీ ఈ ప్రత్యేక చిత్రకారుడి గురించి మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇతడు కాఫీతో పెయింటింగ్ వేస్తాడు.
ఇటాలియన్ కళాకారుడు గియులియా బెర్నార్డెల్లి కాఫీతో చిత్రాలను రూపొందించే కళను నేర్చుకున్నాడు. అతడి పెయింటిగ్స్ చూస్తే ఆశ్చర్యపోతారు.
1987లో మాంటువాలో జన్మించిన గియులియా బోలోగ్నాలోని అకాడెమియా ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత తన కళాత్మక వృత్తిని కొనసాగిస్తున్నాడు. కాఫీతో చేసిన కళాకృతులలో గులియా గుర్తింపు పొందాడు.
గులియా కాఫీ తర్వాత ఐస్ క్రీం పై ఫిల్లింగ్‌తో ఆర్ట్ వర్క్‌లను రూపొందిస్తున్నాడు. కాఫీ లిక్విడ్ నుంచి ప్రసిద్ధ కళాఖండాలు, మానవ చిత్రాలను తయారు చేస్తున్నాడు.
తనలోని ఈ కళ తనకు భిన్నమైన గుర్తింపును తీసుకొచ్చిందని చెబుతున్నాడు. దీనిని ఇలాగే కొనసాగిస్తానని వెల్లడించాడు.