తండ్రి శవం ముందు యువతి ఫొటోషూట్‌.. సోషల్‌మీడియాలో ఏకిపారేస్తున్న జనాలు

Woman Photoshoot: ప్రతిరోజు సోషల్‌మీడియాలో చాలా వార్తలు వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు వీటిని ఎక్కువగా చూస్తారు. తాజాగా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్‌లో అమెరికాకు చెందిన

తండ్రి శవం ముందు యువతి ఫొటోషూట్‌.. సోషల్‌మీడియాలో ఏకిపారేస్తున్న జనాలు
Woman
Follow us
uppula Raju

|

Updated on: Oct 27, 2021 | 11:36 AM

Woman Photoshoot: ప్రతిరోజు సోషల్‌మీడియాలో చాలా వార్తలు వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు వీటిని ఎక్కువగా చూస్తారు. తాజాగా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్‌లో అమెరికాకు చెందిన ఓ యువతి ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. యువతి తండ్రి మృతదేహం ముందు నిలబడి ఆకర్షణీయమైన అవతార్‌లో ఫోజులిచ్చింది. ఆమె చేసిన ఈ పనిని నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

అమెరికాకు చెందిన ఓ యువతి తన తండ్రి అంత్యక్రియలలో ఆకర్షణీయమైన అవతార్‌లో ఫోజులిచ్చింది. ఈ ఫొటోలలో యువతి వెనుక ఆమె తండ్రి మృతదేహం కనిపిస్తుంది. ఈమె నల్లటి వెస్ట్రన్ దుస్తులను ధరించి ఫొటోషూట్‌ చేసింది. అంతేకాదు ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్‌లోని గ్రూప్‌లో షేర్ చేసింది. దీంతో ఈ యువతిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. యువతి చర్య అసభ్యంగా ఉందని ఒక నెటిజన్‌ అన్నాడు. ఇదిలా ఉండగా ఈ యువతి ఎందుకు ఇలా చేసిందనే దానిపై సమాచారం లేదు.

సాధారణంగా శవం ముందు నిలబడి ఫోటో షూట్‌ చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అందుకే చాలా మంది యూజర్లు ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది సదరు యువతికి మద్దతుగా నిలిచారు. ఆమె ఆ సమయంలో ఎందుకు అలా చేసిందో ఎవ్వరికి తెలియదు. ఏదైన బలమైన కారణం ఉండవచ్చు కదా అని కొంతమంది ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమె చేసిన పనికి సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అవుతుంది.

Viral Photos: కాఫీతో అద్భుతమైన పెయింటింగ్‌.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు..