Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sensitive Teeth: సెన్సిటివ్‌ దంతాలతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

Sensitive Teeth: చాలామంది సెన్సిటివ్‌ దంతాలతో ఇబ్బంది పడుతారు. ఎవ్వరికీ చెప్పుకోలేక వారిలో వారు మదనపడుతుంటారు. బాగా చల్లని, బాగా వేడి ఆహారాలను తినలేరు.

Sensitive Teeth: సెన్సిటివ్‌ దంతాలతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
Sensitive Teeth
Follow us
uppula Raju

|

Updated on: Oct 27, 2021 | 10:17 AM

Sensitive Teeth: చాలామంది సెన్సిటివ్‌ దంతాలతో ఇబ్బంది పడుతారు. ఎవ్వరికీ చెప్పుకోలేక వారిలో వారు మదనపడుతుంటారు. బాగా చల్లని, బాగా వేడి ఆహారాలను తినలేరు. దంతాలు సెన్సిటివ్‌గా మారడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వాటిని మళ్లీ మామూలుగా చేయవచ్చు. ఒక్కసారి వాటి గురించి తెలుసుకుందాం.

1. దంతాల ఎనామెల్‌ని జాగ్రత్తగా చూసుకోండి ఇది కఠినమైన రక్షిత పొర. ఎల్లప్పుడు దంతాలను కాపాడుతూ ఉంటుంది. ఇది తొలగిపోయినప్పుడు నరాల నొప్పిని కలిగిస్తుంది. దంతాలు సున్నితంగా మారుతాయి. అప్పటి నుంచి మీరు కొన్ని ఆహారాలను తినడానికి ఇబ్బంది పడుతుంటారు.

2. గట్టిగా బ్రష్ చేయవద్దు ఉదయం పూట బ్రష్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సేపు బ్రష్ చేయకూడదు. ఇలా చేస్తే ఎనామిల్‌ దెబ్బతింటుంది. అంతేకాదు తరచూ బ్రష్‌లని మార్చాలి. ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు.

3. ఆమ్ల ఆహారాలు, పానీయాలు మిఠాయి, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, ఎనామిల్‌పై దాడి చేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, పాలు, సాధారణ పెరుగు ఆహారంలో చేర్చండి. ఇవి మీ నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. దంతాలను దెబ్బతీసే యాసిడ్, బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.

4. పుల్లని పదార్థాలు తిన్న తర్వాత బ్రష్ చేయవద్దు మీరు గ్రీన్ లేదా బ్లాక్ టీని తాగవచ్చు. షుగర్ లెస్ గమ్ నమలవచ్చు. ఏదైనా ఆమ్ల ఆహారాలు తిన్నప్పుడు బ్రష్ చేయడానికి తొందరపడకండి. గంట లేదా రెండు గంటల తర్వాత బ్రష్ చేస్తే మంచిది.

5. ఇతర వ్యాధుల పట్ల జాగ్రత్త చాలా సార్లు వృద్ధాప్యంలో చిగుళ్ళ వ్యాధులు వస్తాయి. ఇది దంతాలకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది దంతాలు సున్నితంగా ఉండటానికి ఇదే కారణం. మీకు సెన్సిటివ్ అనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు పాటించాలి.

Inspiration Story: భర్త, మామ మృతి.. కుటుంబం కోసం రైతుగా మారిన ఓ మహిళ.. ఏటా రూ.25 లక్షల సంపాదన

Indian Railways: రైలు ప్రయాణీకులకు శుభవార్త.. ఇకపై ఆ రైళ్లలో రిజర్వేషన్ ఉండదు..ఎప్పటి నుంచి అంటే..

Post Office: సీనియర్ సిటిజన్స్‌కు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇకపై ఇంటికే డబ్బు.. వివరాలివే.!