Health: ఈ 4 ఆహార పదార్ధాలతో ఎన్నో సూపర్ బెనిఫిట్స్.. డయాబెటిక్‌కు చెక్.. అవేంటంటే.!

వైట్ రైస్ తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ అన్నంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా పిండి పదార్థాలు..

Health: ఈ 4 ఆహార పదార్ధాలతో ఎన్నో సూపర్ బెనిఫిట్స్.. డయాబెటిక్‌కు చెక్.. అవేంటంటే.!
Diabetics
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 27, 2021 | 12:38 PM

వైట్ రైస్ తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ అన్నంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా పిండి పదార్థాలు నేరుగా రక్తంలోకి చేరిపోతాయి. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. చైనా తర్వాత ప్రపంచంలో అధిక సంఖ్యలో డయాబెటిస్‌తో బాధపడుతున్న ప్రజలు భారత్‌లోనే ఉన్నారు. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు కూడా భారీ సంఖ్యలో మధుమేహం వ్యాధి బారిన పడ్డారు. వీరిలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల ప్రజలే ఉన్నారు. ఈ మేరకు రోజువారీ తీసుకునే ఆహారంలో వైట్ రైస్ బదులు ప్రత్యామ్నాయ పదార్థాలను తీసుకోవచ్చు. దలియా, బార్లీ, ఓట్స్, బ్రకోలీ .. వైట్ రైస్‌కు ప్రత్యామ్నాయాలు.

దలియా అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. కిచిడీ, ఉప్మా లేదా సూప్ తయారుచేసుకోవచ్చు. అరకప్పు తెల్ల బియ్యంతో పోల్చుకుంటే గోధుమ రవ్వలో దాదాపు 25 శాతం తక్కువ కేలరీలు ఉంటాయి. మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ B5,B6తో పాటు ఫైబర్ అందుతుంది. బార్లీ రుచి దాదాపుగా ఓట్స్ తరహాలోనే ఉంటుంది. అరకప్పు బార్లీలో 91 గ్రాముల ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి.

వైట్ రైస్‌కు మరొక ప్రత్యామ్నాయం బ్రకోలీ. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన వెజిటబుల్. పోషకాలతో నిండిన ఈ వెజిటబుల్‌ను మీ ఆహారంలో వండుకుని తిన్నా లేదా పచ్చిగా తిన్నా ఆరోగ్యం అందుతుంది. బ్రకోలీని కూడా ఇంట్లోనే సులభంగా వండుకోవచ్చు. బ్రకోలీని తురిమిన తరువాత మీడియం మంటపై కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకుంటే తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral Video: డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

IPL 2022: వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..

Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..