Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూకట్‌పల్లి కోర్టులో ఊరట దక్కింది. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారంటూ...

Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..
Samantha
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2021 | 8:07 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూకట్‌పల్లి కోర్టులో ఊరట దక్కింది. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ ఛానెల్స్(సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ), డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియోల లింకులను వెంటనే తొలగించాలంటూ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్‌నను పాస్ చేసింది.

ఇకపై ఎవరూ కూడా సమంత వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి యూట్యూబ్ ఛానెల్స్ చొరబడకూడదని.. ఇష్టమొచ్చినట్లుగా కంటెంట్ పెట్టకూడదని కోర్టు తెలిపింది. అలాగే తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ సమంతను కోర్టు సూచించింది. సమంత తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు.

ఈ విషయంపై సమంత తరపు లాయర్ మాట్లాడుతూ.. ”కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన కాపీ రేపు అందిన తర్వాత అందులో పూర్తి వివరాలు ఉంటాయి. ఆ తర్వాత సదరు యూట్యూబ్ ఛానల్‌కి నోటీసులు పంపిస్తారు. దానిపై వాళ్ల వాదన విన్నాక కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది” అని క్లారిటీ ఇచ్చారు.

కాగా, నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటనను అధికారికంగా వెల్లడించిన దగ్గర నుంచి సామ్‌పై సోషల్ మీడియా వేదికగా పలు రూమర్స్ వెల్లువెత్తిన విషయం విదితమే. సమంత పిల్లలు వద్దనుకుందని కొందరు.. హెయిర్ స్టైలిస్ట్‌ జుకల్కర్‌, సమంత మధ్య ఎఫైర్ నడుస్తోందని మరికొందరు.. ఇలా ఎన్నో రకాల నెగటివ్ వార్తలు సమంతపై సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

విడాకుల విషయంలో సమంతదే తప్పంటూ పలువురు విమర్శించారు. ఇక వీటన్నింటిపై స్పందించిన సామ్.. ఇలాంటి సమయంలో ఈ రూమర్స్ బాధను కలిగిస్తున్నాయని.. తన ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని కోరుతూ ఆవేదన వ్యక్తం చేసింది. అయినా పట్టించుకోకుండా పలు యూట్యూబ్ ఛానళ్లు సమంతపై నెగటివ్ ప్రచారం చేశాయి. దీనితో సమంత తన పరువుకు నష్టం వాటిల్లేలా వార్తలు, కథనాలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానళ్లపై కూకట్‌పల్లి కోర్టులో సమంత పరువు నష్టం దావా కేసు వేసిన సంగతి తెలిసిందే. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీలతో పాటు వెంకట్రావులపై సమంత పిల్ దాఖలు చేశారు.

Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.

డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?