Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

భార్యాభర్తలన్నాక గొడవలు సర్వ సాధారణం. ఏదొక విషయంలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ఇద్దరూ సర్డుకుపోయినా..

Viral News: రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Wife And Husband
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2021 | 7:29 PM

భార్యాభర్తలన్నాక గొడవలు సర్వ సాధారణం. ఏదొక విషయంలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ఇద్దరూ సర్డుకుపోయినా.. మరికొన్నిసార్లు ఆ గొడవలే చిలికి చిలికి గాలివానగా మారుతుంటాయి. తాజాగా మేము చెప్పబోయే వార్త వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఓ భర్త తన భార్య పోరు పడలేక ఏకంగా జైలుకి పంపించాలని పోలీసులను కోరాడు. అసలు ఆ కథేంటి.? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది.? ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.!

భార్యతో విసుగుచెందిన ఓ భర్త.. ఇంటికంటే జైలే బెటరని నిర్ణయించుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన తాజాగా ఇటలీలో చోటుచేసుకుంది. 30 ఏళ్ళ వివాహితుడైన ఓ వ్యక్తి డ్రగ్స్‌ కేసులో దోషిగా తేలాడు. అతన్ని హౌస్‌ అరెస్ట్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు అతన్ని గృహనిర్బంధం చేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

భార్యతో అతనికి గొడవలు పెరిగాయి. ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడకపోవడంతో మాటా మాటా పెరిగేది. గొడవల నుంచి తప్పించుకొని బయటకు వెళ్దామంటే పోలీసుల ఆంక్షలు. దీంతో విసిగిపోయిన ఆ భర్త.. తనను ఇంటి నుంచి జైలుకు తరలించాలని పోలీసులకు ప్రాధేయ పడ్డాడు. చేసేదేమీలేక.. నిబంధనలు ఉల్లంఘించాడన్న నెపంతో అధికారులు అతన్ని జైలుకు తరలించారు.

Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.

డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..