Indian Railways: రైలు ప్రయాణీకులకు శుభవార్త.. ఇకపై ఆ రైళ్లలో రిజర్వేషన్ ఉండదు..ఎప్పటి నుంచి అంటే..

కోవిడ్-19 విరుచుకుపడుతున్న సమయంలో అమలు చేసిన మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సాధారణ కంపార్ట్‌మెంట్లలో తప్పనిసరి రిజర్వేషన్ సదుపాయాన్ని దశలవారీగా ఉపసంహరించుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

Indian Railways: రైలు ప్రయాణీకులకు శుభవార్త.. ఇకపై ఆ రైళ్లలో రిజర్వేషన్ ఉండదు..ఎప్పటి నుంచి అంటే..
Railway Passenger Alert
Follow us
KVD Varma

|

Updated on: Oct 27, 2021 | 10:00 AM

Indian Railways: కోవిడ్-19 విరుచుకుపడుతున్న సమయంలో అమలు చేసిన మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సాధారణ కంపార్ట్‌మెంట్లలో తప్పనిసరి రిజర్వేషన్ సదుపాయాన్ని దశలవారీగా ఉపసంహరించుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణికులు 23 ప్రత్యేక రైళ్లలో సెకండ్ క్లాస్ కంపార్ట్‌మెంట్లలో సీట్లు రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం జనరల్ కంపార్ట్‌మెంట్లలో రిజర్వేషన్ ఎత్తివేసిన రైళ్లు ఇవే..

  • 06336, కొల్లం-నిలంబూర్ రోడ్
  • 06325, నిలంబూర్ రోడ్ – కొట్టాయం
  • 06304, తిరువనంతపురం – ఎర్నాకులం
  • 06303, ఎర్నాకులం – తిరువనంతపురం
  • 06302, తిరువనంతపురం – షోరనూర్
  • 06301, షోరనూర్ – తిరువనంతపురం
  • 06308, కన్నూర్-అలప్పుజా
  • 06307, అలప్పుజ-కన్నూర్
  • 02628, తిరువనంతపురం – తిరుచిరాపల్లి సూపర్‌ఫాస్ట్
  • 06850, రామేశ్వరం – తిరుచిరాపల్లి
  • 06849, తిరుచిరాపల్లి – రామేశ్వరం
  • 06305, ఎర్నాకులం – కన్నూర్
  • 06306, కన్నూర్-ఎర్నాకులం
  • 06089, డా. MGR చెన్నై సెంట్రల్ – జోలార్‌పేట్టై
  • 06090, జోలార్‌పేట్టై – డా. MGR చెన్నై సెంట్రల్
  • 06844, పాలక్కాడ్ టౌన్ – తిరుచిరాపల్లి
  • 06843, తిరుచరపల్లి – పాలక్కాడ్ టౌన్
  • 06607, కన్నూర్ – కోయంబత్తూరు

ఇవి కాకుండా మిగిలిన రైళ్లలో ఇప్పుడు కూడా సెకండ్ క్లాస్ జనరల్ కోచ్‌లకు రిజర్వేషన్ నిబంధన వర్తిస్తుంది. కొత్త ఆదేశం ప్రకారం, ఆయా రైల్వే జోన్‌లు ఎన్ని కోచ్‌లను డిజర్వ్ చేయవచ్చనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చు. పశ్చిమ రైల్వే ఇటీవల 10 రైళ్లలో డి-రిజర్వ్డ్ జనరల్ కోచ్‌లను కేటాయించింది. డిజర్వ్‌డ్ జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచడంపై తీవ్ర గందరగోళం నెలకొనడంతో రైల్వే బోర్డు సడలింపునకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేసింది.

కేరళలో సర్వీసులు నడుపుతున్న రైళ్లకు, తమిళనాడుకు వెళ్లే రైళ్లకు కూడా సడలింపు వర్తిస్తుంది. అన్నీ దక్షిణ రైల్వే పరిధిలోకి వస్తాయి. కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లే సుదూర రైళ్లలో రిజర్వేషన్ సౌకర్యం కొనసాగుతుంది.

నవంబర్‌ నుంచి కొత్త రూల్‌

నవంబర్‌ మొదటి వారంలోగా కొత్త రూల్‌ అమల్లోకి వస్తుందని అధికారులు సూచించారు. పరశురామ్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం-కన్నూరు ఇంటర్‌సిటీ, ఎరనాడ్ ఎక్స్‌ప్రెస్ మరియు కన్నూర్ ఎగ్జిక్యూటివ్ వంటి కేరళలో ప్రయాణించే ప్రసిద్ధ రైళ్లలోని సాధారణ కంపార్ట్‌మెంట్లలో రిజర్వేషన్ విధానాన్ని ముగించాలని చాలా కాలంగా స్థిరమైన డిమాండ్ ఉంది.

ఐఆర్సీటీసీ(IRCTC) వెబ్‌సైట్ విధించిన అనేక ఆంక్షలు, టిక్కెట్లను రిజర్వ్ చేసేటప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో ప్రయాణీకులు ప్రస్తుతం విసిగిపోయారు. అనేక మంది పార్లమెంటు సభ్యులు, వివిధ రైల్వే ప్రయాణీకుల సంస్థలు ఇప్పుడు మరిన్ని ప్యాసింజర్ రైలు సేవలను నడపాలని అదేవిధంగా రైలు సమయాలను ప్రయాణికులకు అనుకూలంగా మార్చాలని రైల్వేపై ఒత్తిడి తెస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Fact Check: రైల్వేలో ఉద్యోగం వచ్చిందంటూ మెయిల్ వచ్చిందా? జాగ్రత్త.. ఇది మీ సమాచారం దోచేస్తుంది..ఎలా అంటే..

Pension: మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? లేదా మీ ఇంట్లో పెన్షనర్స్ ఉన్నారా? వెంటనే ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోవచ్చు!

Weather: నైరుతి ఉపసంహరణ.. ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!