Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: సీనియర్ సిటిజన్స్‌కు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇకపై ఇంటికే డబ్బు.. వివరాలివే.!

ఇంటికి ఉత్తరాలే కాదు.. పొదుపు ఖాతాలోని డబ్బును కూడా ఉచితంగా ఇంటికే తెచ్చి ఇస్తామంటోంది పోస్టల్‌ శాఖ. మీ ఖాతా ఎక్కడున్నా..

Post Office: సీనియర్ సిటిజన్స్‌కు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇకపై ఇంటికే డబ్బు.. వివరాలివే.!
Postal
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 27, 2021 | 9:47 AM

ఇంటికి ఉత్తరాలే కాదు.. పొదుపు ఖాతాలోని డబ్బును కూడా ఉచితంగా ఇంటికే తెచ్చి ఇస్తామంటోంది పోస్టల్‌ శాఖ. మీ ఖాతా ఎక్కడున్నా.. అవసరమయ్యే మొత్తం చేరవేస్తామంటోంది. పోస్టల్‌ పొదుపు ఖాతాలోనివే కాదు.. ఇతర బ్యాంకుల్లో మీ సొమ్ములున్నా వాటిని తెచ్చి ఇస్తామంటోంది. ఇందుకోసం మీ ఖాతాకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానిస్తే చాలంటోంది.

బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవడం వృద్ధులు, మహిళలను కాస్త ఇబ్బంది పెట్టే వ్యవహారమే. మరీ ముఖ్యంగా వృద్దులకు బ్యాంక్ వరకు వెళ్లి ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే చాలా కష్టం. ఇలాంటి ఇబ్బందులను పోస్టల్‌ శాఖ తీర్చింది. ఖాతా ఏ బ్యాంకులో ఉన్నా.. ఆధార్‌తో అనుసంధానమైతే, బయోమెట్రిక్‌ విధానంతో ఇంటికే వచ్చి డబ్బు చెల్లిస్తుంది. ఇందుకు సమీప పోస్టల్‌ కార్యాలయం ఫోన్‌ నంబరు తీసుకుని సంప్రదిస్తే సరిపోతుందని, అవసరమైన మొత్తం చెబితే పోస్ట్‌మాన్‌ డబ్బు తెచ్చి ఇస్తారు. రోజుకు కనీసం రూ.100 నుంచి గరిష్ఠంగా 10వేలు తీసుకోవచ్చు. ఇలా నెల మొత్తం 30 రోజులు సేవలు పొందవచ్చు.

రాష్ట్రంలో పోస్టల్‌ శాఖకు మొత్తం 82.67 లక్షల పొదుపు ఖాతాలున్నాయి. 27.09 లక్షల ఆసరా పింఛనుదారులుండగా.. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళల పింఛన్లకు సంబంధించిన సేవలను తపాలాశాఖ అందజేస్తోంది. తపాలా బ్యాంకుకు నేరుగా వెళ్లి ఎన్నిసార్లు డబ్బులు వేసినా, తీసినా పైసా చెల్లించాల్సిన పనిలేదు. తపాలా ఏటీఎంలలో మాత్రం 5 సార్లు ఉచిత సేవలు పొందవచ్చు.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral Video: డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

IPL 2022: వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..

Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..