Pension: మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? లేదా మీ ఇంట్లో పెన్షనర్స్ ఉన్నారా? వెంటనే ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోవచ్చు!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం నవంబర్ 30 లోపు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని(లైఫ్ సర్టిఫికేట్) సమర్పించాలి. పెన్షనర్ దానిని తన పెన్షన్ ఖాతాలో సమర్పించాల్సి ఉంటుంది.

Pension: మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? లేదా మీ ఇంట్లో పెన్షనర్స్ ఉన్నారా? వెంటనే ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోవచ్చు!
Pensioners Life Certificate
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 27, 2021 | 7:43 PM

Pension: దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం నవంబర్ 30 లోపు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని(లైఫ్ సర్టిఫికేట్) సమర్పించాలి. పెన్షనర్ దానిని తన పెన్షన్ ఖాతాలో సమర్పించాల్సి ఉంటుంది. నిజానికి, ఇది పెన్షనర్ సజీవంగా ఉన్నట్లు నిర్ధారించే సర్టిఫికేట్. కాబట్టి మీరు పెన్షన్ తీసుకుంటూ ఉంటే లేదా మీ కుటుంబంలో ఎవరైనా పెన్షనర్ ఉంటే ఈ విషయంలో వెంటనే స్పందించాల్సి ఉంది. ఈ జీవిత ధృవీకరణ పత్రాన్ని నవంబర్ 30లోపు సమర్పించడం చాలా ముఖ్యం. లేదంటే మీ పెన్షన్ ఆగిపోయే అవకాశాలున్నాయి.

నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించండి

లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దీని ద్వారా పెన్షనర్లు వారి పెన్షన్ ఖాతాలో వారి మనుగడ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. ఇది కాకుండా, మీరు మీ సమీపంలోని ఆధార్ కేంద్రం లేదా ఏదైనా సాధారణ సేవా కేంద్రం ద్వారా కూడా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.

సర్టిఫికెట్లను డిజిటల్‌గా కూడా సమర్పించవచ్చు

ఇది కాకుండా, పింఛనుదారులు కావాలనుకుంటే, ఈ సర్టిఫికేట్‌ను డిజిటల్‌గా కూడా సమర్పించవచ్చు. ఇందులో ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు సమర్పించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి, పెన్షనర్లు ముందుగా జీవన్ ప్రమాన్(https://jeevanpramaan.gov.in ) వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత గెట్ ఎ సర్టిఫికేట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీని ద్వారా లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత, మీరు పింఛనుదారుల ఆధార్ నంబర్, పేరు, ఫోన్ నంబర్, పెన్షన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వాలి. ఆధార్ ద్వారా ప్రామాణీకరించబడిన తర్వాత, లైఫ్ సర్టిఫికేట్ ID పెన్షనర్ ఫోన్‌లో వస్తుంది. ఆ వెంటనే పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ ఐడిని ఇవ్వడం ద్వారా పిడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు సమర్పించాలి?

వాస్తవానికి, పెన్షన్ స్కీమ్-1995 (EPS-95) కింద పెన్షన్ చెల్లింపు కోసం పెన్షన్ హోల్డర్లు లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ పత్ర) లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. అందువల్ల ప్రతి సంవత్సరం పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ లేదా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీంతో పింఛన్‌కు ఇబ్బంది ఉండదు. మీకు కూడా పెన్షన్ వస్తే. లేదా మీ కుటుంబంలో పెన్షనర్ ఉన్నట్లయితే, మీరు మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సకాలంలో సమర్పించాలి. లేదంటే మీ పెన్షన్ ఆగిపోవచ్చు.

ఇవి కూడా చదవండి: Redmi Note 11: మార్కెట్లోకి రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌ ఫోన్‌లు.. 108 మెగా పిక్సెల్స్‌ కెమెరాతో అదిరిపోనున్న ఫీచర్లు..

Lenovo Tab k10: భారత మార్కెట్లోకి లెనోవో నుంచి కొత్త ట్యాబ్‌.. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో ఆకట్టుకునే ఫీచర్లు..

Health: నిత్యం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా.? అయితే మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..