Redmi Note 11: మార్కెట్లోకి రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌ ఫోన్‌లు.. 108 మెగా పిక్సెల్స్‌ కెమెరాతో అదిరిపోనున్న ఫీచర్లు..

Redmi Note 11: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ తన మార్కెట్‌ను రోజురోజుకీ విస్తరిస్తూ పోతోంది. తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన..

Redmi Note 11: మార్కెట్లోకి రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌ ఫోన్‌లు.. 108 మెగా పిక్సెల్స్‌ కెమెరాతో అదిరిపోనున్న ఫీచర్లు..
Redmi 11 Series
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 27, 2021 | 6:20 AM

Redmi Note 11: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ తన మార్కెట్‌ను రోజురోజుకీ విస్తరిస్తూ పోతోంది. తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్‌లను పరిచయం చేసిన ఈ సంస్థ బడా, బడా కంపెనీలను సైతం వెనక్కి నెడుతూ టాప్‌ ప్లేస్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కొంగొత్త స్మార్ట్‌ ఫోన్‌లను పరిచయం చేస్తూ వస్తోన్న షావోమీ తాజాగా రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈ ఫోన్‌ లాంచింగ్‌ కార్యక్రమాన్ని అక్టోబర్‌ 28న నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలోనే షావోమి రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌ ఫోన్లతో పాటు రెడ్‌మి వాచ్‌ 2ను కూడా ఆవిష్కరించనుంది. ఇదిలా ఉంటే రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌ విడుదలకు ముందే ఆ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లను కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ ఫోన్‌ను 120డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తీసుకురానున్నారు. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో ఫోన్‌లను విడుదల చేయనున్నారు. ప్రాసెసర్‌ విషయానికొస్తే ఇందులో.. మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్, రెడ్‌మి నోట్ 11 ప్రో మీడియాటెక్ డిమెన్సిటీ 920 ప్రాసెసర్, రెడ్‌మి నోట్ 11 ప్రో+ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్‌ను అందించారు.

కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్స్‌ రెయిర్‌ కెమరా, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. మరి రెడ్‌మి నుంచి స్తోన్న ఈ కొత్త సిరీస్‌ ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి. ఇక ధర విషయం మాత్రం లాంచింగ్ రోజు తెలిసే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Carrot farming: రైతుకు వరంగా మారుతున్న రుధిర క్యారెట్ సాగు.. అతి తక్కువ సమయంలో ఎక్కవ దిగుబడి..

Palnadu Politcs: ఎమ్మెల్యే కాసు, యరపతినేని మధ్య రాజకీయ వైరం కొత్త టర్న్‌.. పౌరుషాల గడ్డ పల్నాడులో వైసీపీ నేతల ‘గాంధీ’గిరి

Lakshmi Manchu: మోడరన్ అయినా ట్రెడిషన్ అయినా నేనే.. ‘మంచు లక్ష్మి’ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!