Fact Check: రైల్వేలో ఉద్యోగం వచ్చిందంటూ మెయిల్ వచ్చిందా? జాగ్రత్త.. ఇది మీ సమాచారం దోచేస్తుంది..ఎలా అంటే..

ఇటీవల కాలంలో చాలామంది ఈ మెయిల్స్ లో ఒక ఆఫర్ లెటర్ వస్తోంది. ఈ ఆఫర్ లెటర్ ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినట్టు ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ నుండి అని చెప్పుకుంటూ ఒక ఆఫర్ లెటర్ సర్క్యులేట్ అవుతోంది.

Fact Check: రైల్వేలో ఉద్యోగం వచ్చిందంటూ మెయిల్ వచ్చిందా? జాగ్రత్త.. ఇది మీ సమాచారం దోచేస్తుంది..ఎలా అంటే..
Fact Check
Follow us
KVD Varma

|

Updated on: Oct 27, 2021 | 7:58 AM

Fact Check: ఇటీవల కాలంలో చాలామంది ఈ మెయిల్స్ లో ఒక ఆఫర్ లెటర్ వస్తోంది. ఈ ఆఫర్ లెటర్ ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినట్టు ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ నుండి అని చెప్పుకుంటూ ఒక ఆఫర్ లెటర్ సర్క్యులేట్ అవుతోంది. అందులో క్లర్క్ పోస్ట్ కోసం ఆ మెయల్ అందుకున్నవారిని నియమించినట్లు ఉంటోంది. మీకు కూడా అలాంటి ఆఫర్ లెటర్ వస్తే, అస్సలు నమ్మొద్దు. ఈ ఆఫర్ లెటర్ తప్పు అలాగే నకిలీ. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.

ఫేక్ ఆఫర్ లెటర్‌లో ఏముంటుందంటే..

ఆ ఈ మెయిల్ అందుకున్న వారిని క్లర్క్ పోస్టుకు నియమించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేరుతో ఆఫర్ లెటర్ ఉంటుంది. ఈ లేఖ సాధారణంగా ఈ మెయిల్ ద్వారా వస్తుంది. మెయిల్ నోటిఫికేషన్ కూడా రైల్వే ఉద్యోగం అని ఉంటుంది. దీంతో, అది రైల్వేశాఖ నుంచి వచ్చందని పొరపాటు పడి ఆ మెయిల్ ఓపెన్ చేస్తారు. అలా చేయవద్దని పీఐబీ సూచిస్తోంది. ఎందుకంటే, ఈ లేఖకు సంబంధించి పీబీఐ విషయాన్ని తెలుసుకోవడానికి చెక్ చేసింది. అయితే, ఈ చెక్ లో ఆ లేఖ నకిలీ అని తేలిందని పీఐబీ చెబుతోంది.

ఎందుకు ఆ లెటర్ నకిలీది?

రైల్వే మంత్రిత్వ శాఖ నేరుగా ఎవరినీ ఉద్యోగాలలో నియమించదు. రైల్వే లో ఏదైనా ఉద్యోగాలని భర్తీ చేయాల్సి వచ్చినపుడు తన ఆధ్వర్యంలోని ఆరార్బీ(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్) 21 బోర్డుల ద్వారా మాత్రమే భర్తీ ప్రక్రియ చేపడుతుంది. ఇందుకోసం ముందుగా నోటిఫికేషన్ ఇవ్వడం దగ్గర నుంచి అన్నిటినీ ఆన్ లైన్ లో ఉంచుతుంది. అంతేకానీ, నేరుగా ఎవరినీ ఉద్యోగాలోకి తీసుకోదు రైల్వే శాఖ. అందువల్ల ఇది మిమ్మల్ని మోసం చేయడం కోసం మాత్రమే అనేది స్పష్టం.

ఈ మెయిల్ తెరిస్తే ఏమవుతుంది..

ఇటువంటి మెయిల్స్ సాధారణంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం కోసం అయివుంటుంది. ఇది మిమ్మల్ని మోసం చేయడం కోసమే. ఈ విధమైన ఈ మెయిల్ లో ఒక లింక్ ఇస్తారు. దానిని ఓపెన్ చేసిన వెంటనే మన వ్యక్తిగత సమాచారం మొత్తం మోసగాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. కాబట్టి.. ఇటువంటి మెయిల్స్ ఓపెన్ చేయకుండా ట్రాష్ చేయండి. ఎటువంటి పరిస్థితిలోనూ మీ వ్యక్తిగత సమాచారం ఇటువంటి మెయిల్స్ కు ఇవ్వవద్దు. ఎందుకంటే, ఏ ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల కోసం వ్యక్తిగత సమాచారాన్ని ఆన్ లైన్ లో కోరదు.

ఇక ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న PIB ఫాక్ట్ చెక్ ఈ నకిలీ ఆఫర్ లెటర్ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. ఈ లేఖలో, ఉద్యోగం ప్రారంభించే తేదీ 15 నవంబర్ 2021గా ఇచ్చారు. ఇది బెంగళూరు చిరునామా నుండి వస్తోంది. ఆఫర్ రెండవ హార్డ్ కాపీపై సంతకం చేసి, ఆఫర్‌ను అంగీకరించడానికి పోస్ట్‌మ్యాన్‌కి తిరిగి ఇవ్వమని ఇది పేర్కొంది. చేరడానికి ముందు, ఒకరు అతని/ఆమె మెడికల్ ఫైల్, ఎగ్జామ్ ఫైల్ దీంతో పాటు డ్రాఫ్ట్ కూడా సమర్పించాలని సూచనలు ఇస్తోంది.

పీఐబీ (PIB) ఫాక్ట్ చెక్ అంటే ఏమిటి?

ప్రభుత్వ విధానాలు లేదా పథకాలపై తప్పుడు సమాచారాన్ని పీఐబీ ఫాక్ట్ చెక్ నిర్ధారిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా వార్తలు నకిలీవని మీరు అనుమానించినట్లయితే, మీరు దాని గురించి పీఐబీ వాస్తవ తనిఖీకి తెలియజేయవచ్చు. దీని కోసం మీరు 918799711259 మొబైల్ నంబర్‌కు లేదా socialmedia@pib.gov.in ఇమెయిల్ ఐడీకి పంపవచ్చు.

ఇవి కూడా చదవండి: Redmi Note 11: మార్కెట్లోకి రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌ ఫోన్‌లు.. 108 మెగా పిక్సెల్స్‌ కెమెరాతో అదిరిపోనున్న ఫీచర్లు..

Lenovo Tab k10: భారత మార్కెట్లోకి లెనోవో నుంచి కొత్త ట్యాబ్‌.. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో ఆకట్టుకునే ఫీచర్లు..

Health: నిత్యం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా.? అయితే మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..