మద్యం తాగేటప్పుడు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు… తింటే ఇక అంతే సంగతులు.. అవెంటంటే..

సాధారణంగా ఆల్కహాల్ సేవించే సమయంలో స్టఫ్‏గా స్పైసీ ఫుడ్స్ తీసుకుంటుంటారు.. అంతేకాకుండా ఆల్కహాల్ ఖాళీ కడుపుతో తాగడం

మద్యం తాగేటప్పుడు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు... తింటే ఇక అంతే సంగతులు.. అవెంటంటే..
Alcohol
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 27, 2021 | 11:02 AM

సాధారణంగా ఆల్కహాల్ సేవించే సమయంలో స్టఫ్‏గా స్పైసీ ఫుడ్స్ తీసుకుంటుంటారు.. అంతేకాకుండా ఆల్కహాల్ ఖాళీ కడుపుతో తాగడం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఆల్కహాల్ శరీరాన్ని డీ హైడ్రేట్ చేసి ఉప్పు సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీంతో ఉదయాన్నే తీవ్రమైన తలనొప్పి బాధిస్తుంది. ఆల్కహాల్ తీసుకునే సమయంలో సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఆల్కహాల్ తీసుకునే సమయంలో కొన్ని ఆహార పదార్థాలను దూరంగా ఉండాలి.. అవెంటో తెలుసుకుందామా..

* ఆల్కహాల్ తీసుకునే సమయంలో బీన్స్, చిక్కుళ్లు వంటి పదార్థాలను అస్సలు తీసుకోవద్దు.. వీటిలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇవి తీసుకోవడం వలన శరీరం ఐరన్ గ్రహించదు. * బీర్ తాగినప్పుడు బ్రెడ్ అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే బీర్, బ్రెడ్ రెండు ఈస్ట్ కలిగి ఉంటాయి. దీనిని కడుపు తొందరంగా జీర్ణం చేసుకోదు. ఫలితంగా జీర్ణ సమస్యలు కలుగుతాయి. * మద్యం తాగినప్పుడు ఫ్రెంచ్ ప్రైస్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.. వాటిలో సోడియం (ఉప్పు) అధికంగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ పై హానికరమైన ప్రభావం ఉంటుంది. * మద్యం సేవించినప్పుడు చాక్లెట్ తినడం మంచిది కాదు. ఇతర ఆమ్ల ఆహారాల మాదిరిగా చాక్లెట్ లోని కెఫిన్, కొవ్వు, కోకో పదార్థాలను జీర్ణశయాంతర సమస్యలనుకలిగిస్తాయి. * ఆల్కహాల్ కడుపును ఖాళీ చేయండంలో కాస్త ఆలస్యం చేస్తుంది. అన్నవాహిక స్పింక్టర్‏లో ఒత్తిడి తగ్గిస్తుంది. ఇది యాసిడ్ రిప్లక్స్ కు కారణమవుతుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పిజ్జా తీసుకోవద్దు. ఇందులో పిజ్జాలోని ఆమ్లా టమోటా GERD, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట సమస్యలను కలిగిస్తుంది. టమోటాలు లేకుండా ఏదైనా ఇతర పిజ్జా తినవచ్చు. * ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పాల ఉత్పత్తులను అస్సలు తీసుకోవద్దు. ఇవి తీసుకోవడం వలన కడుపు సమస్యలు వస్తాయి. * ఇవి కాకుండా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నట్స్, సలాడ్స్ తీసుకోవచ్చు. కానీ అందులో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

Also Read: కవి.. గేయ రచయిత క్యాన్సర్‏తో పోరాటం.. కందికొండను కాపాడుకుందాం..

చరణ్-శంకర్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చెర్రీతో తలపడనున్న విలన్ ఎవరంటే..